Abn logo
Sep 19 2021 @ 01:02AM

చంద్రబాబు ఇంటిపై దాడి సరికాదు

మీడియాతో మాట్లాడుతున్న చింతామోహన్‌

ప్రైవేటీకరణతో దేశ భవిష్యత్‌ ప్రశ్నార్థకం

కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌


తిరుపతి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): టీడీపీ నేత చంద్రబాబు ఇంటిపై అధికార పార్టీ వైసీపీ చేసిన దాడిని కేంద్ర మాజీమంత్రి డాక్టర్‌ చింతా మోహన్‌ ఖండించారు. శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలను గౌరవించినప్పుడే అధికారపార్టీ గౌరవం నిలబడుతుందన్నారు. రేణిగుంట దగ్గర ఉన్న సీఆర్‌ఎస్‌ను ప్రైవేట్‌వాళ్లకు అప్పగిస్తున్నారని, 400 ఎకరాల భూమి కలిగి, దాదాపు మూడువేల మంది రైల్వే ఉద్యోగుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. 150 చ.కిమీ ఉన్న శ్రీహరికోట రాకెట్‌ కేంద్రాన్ని అమ్మాలనుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. 1050 ఎకరాల్లో ఉన్న తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా నామమాత్రపు ధరకు విక్రయించాలని నిర్ణయిస్తున్నారని ఈ పరిణామాలు చూస్తుంటే దేశం ఎటుపోతుందో అర్థం కావడంలేదని ఆవేదన చెందారు. నెహ్రూ సోషలిజంవైపు అడుగులేస్తే, మోదీ క్యాపిటలిజం వైపు పోతున్నారని విమర్శించారు. ఇందిరాగాంధీ ప్రైవేట్‌ బ్యాంకులను జాతీయం చేస్తే, ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పారు. టీటీడీ పాలకమండలి సభ్యులుగా ఎంత మందినైనా తీసుకుంటే తమకు అభ్యంతరం లేదుకానీ.. తీహార్‌కు వెళ్లొచ్చినవారికి కూడాచోటు కల్పించి అబాసు పాలు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.