ప్రజలపై రోజూవారి దాడులు: బీజేపీపై మండిపడ్డ ప్రియాంక

ABN , First Publish Date - 2021-10-31T21:14:51+05:30 IST

దళితులు, శ్రామికులు, ఓబీసీలు, పేదప్రజలు, మైనారిటీలు, బ్రాహ్మణులను బీజేపీ వంచిస్తోందని, మోసం చేస్తోందని అన్నారు. గోరఖ్‌పూర్‌లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రియాంక పాల్గొని ప్రసంగించారు...

ప్రజలపై రోజూవారి దాడులు: బీజేపీపై మండిపడ్డ ప్రియాంక

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ పాలన అరాచకంగా ఉందని, ప్రజలను వర్గాలుగా విడదీసి వారిపై రోజూవారి దాడులకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. దళితులు, శ్రామికులు, ఓబీసీలు, పేదప్రజలు, మైనారిటీలు, బ్రాహ్మణులను బీజేపీ వంచిస్తోందని, మోసం చేస్తోందని అన్నారు. గోరఖ్‌పూర్‌లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రియాంక పాల్గొని ప్రసంగించారు.


‘‘పంచదారకు ఇన్ని రోజులు కనీస మద్దతు ధర ఇవ్వలేదు. అలాంటిది ఉన్నపళంగా ఇప్పుడెందుకు మద్దతు ధర ఇస్తామని ప్రకటించారు? 4.5 ఏళ్లలో లేని ఆలోచన ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇన్నేళ్లు ఎందుకు చేయలేదు? నాలుగున్నరేళ్ల పాటు ధరలు తగ్గించి ఇప్పుడు ఒక్కసారిగా పెంచడం కేవలం ఎన్నికల కోసమేగా? రైతులనే కాదు దళితులు, శ్రామికులు, ఓబీసీలు, పేదప్రజలు, మైనారిటీలు, బ్రాహ్మణులను బీజేపీ ఎంత మోసం చేయాలో అంతగా మోసం చేసింది, వంచించింది. గురు గోరఖ్‌నాథ్ బోధనలను యోగి ప్రభుత్వం మరిచిపోయింది. ప్రజలపై రోజు వారి దాడులకు దిగడం పరిపాటి అయిపోయింది’’ అని ప్రియాంక అన్నారు.

Updated Date - 2021-10-31T21:14:51+05:30 IST