కోడి పందేల స్థావరాలపై దాడులు

ABN , First Publish Date - 2021-01-16T05:18:00+05:30 IST

మండలంలోని పిడతలపూడి గ్రామ శివారు ప్రాంతంలో కోడి పందేల స్థావరాలపై గురువారం ఎస్‌ఐ బాబీ సిబ్బంతో కలిసి దాడులు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

కోడి పందేల స్థావరాలపై దాడులు

చిల్లకూరు, జనవరి 15: మండలంలోని పిడతలపూడి గ్రామ శివారు ప్రాంతంలో కోడి పందేల స్థావరాలపై గురువారం ఎస్‌ఐ బాబీ సిబ్బంతో కలిసి దాడులు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.  వారి నుంచి ఒక పందెం కోడి, రూ. 720 నగదు, 5 పందెం కత్తులను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రెట్టపల్లి ప్రాంతంలోని కోడిపందెల స్థావరాలపై దాడులు నిర్వహించి నలుగురు వ్యక్తులు అదుపులోకి తీసుకుని వారి నుంచి మూడు పందెం కోడిపుంజులు రూ. 1320 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

కోట : కోట మండలం యమదిన్నెపాళెంలో  కోడిపందెల స్థావరాలపై శుక్రవారం పోలీసులు దాడులు జరిపారు. 5 పుంజులు, 8 వాహనాలను స్వాధీనం చేసుకొని 8 మంది జూదరులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై మహేంద్ర తెలిపారు.


Updated Date - 2021-01-16T05:18:00+05:30 IST