Advertisement
Advertisement
Abn logo
Advertisement

ముస్లిం, మైనార్టీలపై దాడులను అరికట్టాలి

సూర్యాపేట(కలెక్టరేట్‌), డిసెంబరు 1: దేశంలో ముస్లిం, మైనార్టీలపై సంఘ్‌ పరివార్‌ దాడులను వెంటనే అరికట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట బుధవారం  నిరసన తెలిపి మాట్లాడారు. మైనార్టీపై దాడులు పెరిగాయన్నారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని  కాన్పూర్‌లో ఓ రిక్షా కార్మికు డిని సంఘ్‌ పరివార్‌ కార్యకర్తలు ఇబ్బందులకు గురిచేశారన్నారు. త్రిపుర రాష్ట్రంలో వీహెచ్‌పీఎస్‌ కార్యకర్తలు మసీదులను ధ్వంసం చేస్తున్నార న్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్‌ మోహన్‌రావుకు అందచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకు లు మౌలానా అస్లాం,  మట్టిపల్లి సైదులు, కోట గోపి,పాల్గొన్నారు.

Advertisement
Advertisement