ప్రతిపక్ష నేతలపై దాడులా?

ABN , First Publish Date - 2021-10-22T04:44:11+05:30 IST

ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడం ప్రతిపక్షం బాధ్యతని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. లోపాలు చెబితే దాడులు చేస్తారా? ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఇలా జరిగాయా? అని ప్రశ్నించారు. గురువారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు

ప్రతిపక్ష నేతలపై దాడులా?
మాట్లాడుతున్న అశోక్‌గజపతిరాజు

 కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ 

విజయనగరం రూరల్‌, అక్టోబరు 21: ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడం ప్రతిపక్షం బాధ్యతని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. లోపాలు చెబితే దాడులు చేస్తారా? ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఇలా జరిగాయా? అని ప్రశ్నించారు. గురువారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఉండకుండా చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. లోపాలు ఎత్తి చూపడం వల్ల అధికార పార్టీ నాయకులకు బీపీ లెవెల్స్‌ పెరగడం సహజమని, ఇటువంటి సందర్భంలో డాక్టర్‌ వద్దకు వెళ్లి చికిత్స చేసుకుంటే మేలని ఎద్దేవా చేశారు. డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ తన బాధ్యతలకు న్యాయం చే స్తున్నట్టు ఎక్కడా కనిపించడం లేదన్నారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన తరువాత హైకోర్టు మెట్లు ఎన్నిసార్లు ఎక్కారో స్పష్టం చేయాలన్నారు.

విజయవాడకు పయనమైన తమ్ముళ్లు

తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షకు సంఘీభావం తెలిపేందుకు విజయనగరం నియోజకవర్గం నుంచి ముఖ్య నేతలు ఐవీపీ రాజు, విజ్జపు ప్రసాద్‌, కనకల మురళి,  బొద్దల నర్సింగరావు, గంటా పోలినాయుడు, క ర్రోతు నర్సింగరావు, కంది మురళీనాయుడు, ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్‌తో పాటు పలువురు టీడీపీ నాయకులు గురువారం సాయంత్రం పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరారు. దీక్షా స్థలం వద్దకు శుక్రవారం వెళ్లి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును కలువనున్నారు. 


Updated Date - 2021-10-22T04:44:11+05:30 IST