అట్టహసంగా దామచర్ల జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2022-01-21T05:18:41+05:30 IST

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ జన్మదిన వేడుకలు అట్టహసంగా జరిగాయి. ఈ సందర్భంగా గురువారం ఒంగోలుతో పాటు జిల్లాలోని పలు చోట్ల టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు వేడుకలు నిర్వహించారు. ఒంగోలులోని టీడీపీ కార్యాలయం, నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొనగా పెద్దసంఖ్యలో తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

అట్టహసంగా దామచర్ల జన్మదిన వేడుకలు
దామచర్లకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్న నేతలు

శుభాకాంక్షలు చెప్పిన ప్రముఖులు

భారీగా కలిసిన కార్యకర్తలు, అభిమానులు

(ఆంఽధ్రజ్యోతి, ఒంగోలు)

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ జన్మదిన వేడుకలు అట్టహసంగా జరిగాయి. ఈ సందర్భంగా గురువారం ఒంగోలుతో పాటు జిల్లాలోని పలు చోట్ల టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు వేడుకలు నిర్వహించారు. ఒంగోలులోని టీడీపీ కార్యాలయం, నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొనగా పెద్దసంఖ్యలో తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు, కొండపి, ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గాల్లోని పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో వచ్చారు. పలువురు నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సీఎం చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చంనాయుడుతోపాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, స్వామి, పార్టీ ఒంగోలు లోక్‌సభ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, ఇతర ఇన్‌చార్జ్‌లు, మాజీ మంత్రులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఒంగోలులోని టీడీపీ శ్రేణులు ఉత్సాహ భరితంగా ఈ వేడుకల్లో పాల్గొనటం విశేషం. 



Updated Date - 2022-01-21T05:18:41+05:30 IST