Abn logo
Sep 27 2021 @ 00:13AM

వైసీపీ నేత ఇంట్లో చోరీకి దుండగుల యత్నం

దుండగులు బద్దలు కొట్టిన తలుపులు

ధైర్యంగా అడ్డుకున్న మహిళ

రామకుప్పం, సెప్టెంబరు 26: రామకుప్పం మండలం చెల్దిగానిపల్లె సమీపంలో వైసీపీ నేత మధుసూదన్‌రెడ్డి ఇంట్లో శనివారం అర్ధరాత్రి దుండగులు చోరీకి యత్నించారు. ఇంట్లో నిద్రిస్తున్న మధుసూదన్‌రెడ్డి భార్యకు మెలకువ వచ్చి ఇంట్లోకి చొరబడుతున్న దుండగులను ధైర్యంగా అడ్డుకోవడంతో వారు పరారయ్యారు. శనివారం అర్ధరాత్రి దాటాక తలుపు వద్ద శబ్దం రావడంతో  ఇంట్లో నిద్రిస్తున్న మధుసూదన్‌రెడ్డి భార్య స్వరూప వెళ్ళి చూసింది. అప్పటికే తలుపులు బద్దలు కొట్టిన ముగ్గురు ముసుగులు ధరించిన దుండగులు  కత్తులు, ఇనుపరాడ్లతో ఇంట్లోకి ప్రవేశించే యత్నం చేశారు. స్వరూప ఽధైర్యంగా కత్తిపట్టుకున్న వ్యక్తి రెండు చేతులను గట్టిగా పట్టుకుంది. బిగ్గరగా కేకలు పెడుతూ అతడి వద్ద నుంచి కత్తి లాక్కుంది. దీంతో అతడు బయటకు వెళ్లిపోయాడు. మరో ఇద్దరు దొంగలు ఇంట్లోకి వెళ్లే ప్రయత్నంలో ఉండగానే మేడపై నిద్రిస్తున్న మధుసూదన్‌రెడ్డి కిందకు రావడంతో అతడిని చూసి దొంగలు పారిపోయారు. అందిన సమాచారంతో అక్కడికి చేరుకున్న రామకుప్పం పోలీసులు, క్లూస్‌ టీం  సంఘటనా స్థలిని పరిశీలించారు.

దొంగలను అడ్డుకున్న స్వరూప