భార్యపై హత్యాయత్నం

ABN , First Publish Date - 2021-05-17T05:52:29+05:30 IST

భార్యపై అనుమానంతో భర్త బ్లేడుతో హత్యాయత్నం చేసిన సంఘటన మండలంలోని బోయపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది.

భార్యపై హత్యాయత్నం
దాడికి పాల్పడిన రీటా భర్త ఫోపూన్‌గనూన్‌ను స్తంభానికి కట్టేసిన స్థానికులు

భర్తను స్తంభానికి కట్టేసి కొట్టిన స్థానికులు

బోయపాలెం(యడ్లపాడు), మే 16: భార్యపై అనుమానంతో భర్త బ్లేడుతో హత్యాయత్నం చేసిన సంఘటన మండలంలోని బోయపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిస్సాకి చెందిన భార్యాభర్తలైన ఫోపూన్‌గనూన్‌, రీటాలు కొద్ది కాలంగా స్థానిక రంగనాయక నూలు పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్న భర్త తరచూ ఆమెతో గొడవ పడుతున్నాడు. ఆదివారం ఉదయం బోయపాలెం సెంటర్‌కు వచ్చిన వీరి మఽధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన ఫోపూన్‌గనూన్‌ బ్లేడుతో భార్యపై దాడి చేయడంతో  గొంతు భాగంలో గాయమైంది. గమనించిన స్థానికులు భర్తను పట్టుకుని దేహశుద్ధి చేసి అక్కడే ఉన్న స్తంభానికి కట్టి పోలీసులకు అప్పగించారు. రీటాను చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్య దాడికి ప్రయత్నించడం వల్లనే తాను కూడా దాడి చేసినట్లు భర్త పోలీసులకు తెలిపారు. 

Updated Date - 2021-05-17T05:52:29+05:30 IST