Abn logo
Sep 23 2021 @ 00:38AM

భూ యజమానులపై దాడికి యత్నం

ధర్మవరం, సెప్టెంబరు 22: సర్వే విషయంలో భూ యజమానులపై కొందరు వ్యక్తులు బుధవారం మధ్యాహ్నం దాడికి యత్నించిన సంఘటన మండలంలోని మం గళమడక గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలమేరకు... మండలంలోని మంగళ మడక గ్రామంలో సున్నపురాళ్ల రంగమ్మ, రామప్ప దంపతులకు 8 ఎకరాలు పొలం ఉంది. అయితే వీరికి చెందిన 53 సెంట్ల స్థలం కోర్టులో ఉంది. ఈ నేపధ్యంలో ఆ స్థలా న్ని అదే గ్రామానికి చెందిన పోతులరామ్మోహన్‌ మరికొందరు వ్యక్తు లు సర్వేచేయ డానికి వచ్చారు. కోర్టు ఉత్తర్వులు ఉండటం వల్ల తమ పొలంలో సర్వే నిర్వహించరాదని రంగమ్మ, రామప్ప అడ్డుకున్నారు. దీంతో రామ్మోహన్‌తో పాటు మరి కొందరు వ్యక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కులం పేరుతో దూషిస్తూ గ్రామస్థులు స మక్షంలోనే  మూకు మ్మడిగా రంగమ్మ, రామప్పలపై దాడికి దిగారు. దీంతో పొలం వద్ద ఉద్రిక్త వాతావ రణం చోటుచేసుకుంది. దీంతో బాధితులు తీవ్ర భయాందోళనకు గుర య్యారు. డయల్‌ 100కి ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకు న్నారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో అనంతరం ఇరు వర్గాలను ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఆదేశించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. సమస్యపై విచారించి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.