Abn logo
Sep 23 2021 @ 23:48PM

బంగారు దుకాణంలో చోరీ యత్నం కేసులో.. 10 మంది అరెస్టు

నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఓఎస్‌డీ దేవప్రసాద్‌

కడప(క్రైం), సెప్టెంబరు 23: ప్రొద్దుటూరు టౌన మోక్షగుండం వీధిలో ఉన్న ఓ బంగారు దుకాణంలో రెండు రోజుల క్రితం చోరీ చేసేందుకు ప్రయత్నించిన పది మందిని ప్రొద్దుటూరు పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని అదనపు ఎస్పీ చాంబర్‌లో ఓఎ్‌సడీ దేవప్రసాద్‌ ప్రొద్దుటూరు డీఎస్పీ వై.ప్రసాద్‌రావు, ప్రొద్దుటూరు వనటౌన సీఐ నాగరాజుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలను వెల్లడించారు. ప్రొద్దుటూరు టౌన ఆర్ట్స్‌ కాలేజీ రోడ్డుకు చెందిన షేక్‌ యాకూబ్‌ గతంలో ప్రొద్దుటూరులో బంగారు వ్యాపారం చేసేవాడు. నష్టాలు రావడంతో ఇతను నాలుగు సంవత్సరాల క్రితం బంగారు వ్యాపారం వదిలి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం మొదలు పెట్టాడు. దాంట్లో కూడా నష్టపోయాడు. దీంతో కారుడ్రైవర్‌గా పని చేసిన చెన్నూరు మండలం రామలపల్లెకు చెందిన తోటరామచంద్రుడు, అదే గ్రామానికి పాళెపల్లి నిత్యపూజయ్యను పిలిపించి ఎవరైనా మంచి చోరీలు చేసేవారుంటే పిలిపిస్తే బంగారు దుకాణంలో చోరీ చేద్దామని చెప్పాడు.
వీరు ముగ్గురూ కలసి ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని బ్రహ్మగారి కాలనీకి చెందిన రావులకొల్లు వెంకటేశ్వర్లు, గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎర్రబాలెంకు చెందిన ఓబేరు బంగారురాజు అలియాస్‌ రాజ్‌కుమార్‌, విజయవాడ సిటీ బ్రాహ్మణవీధికి చెందిన అక్కవరపు బాలయేసు అలియాస్‌ బాలకోటయ్య, విజయవాడ ఆకుల వీధికి చెందిన కలువకొల్లు వెంకన్న, విశాఖపట్నం జిల్లా నర్సిపట్నం తాలూక చోద్యం గ్రామం మొల్లడేవిడ్‌రాజు, కొత్తవీధికి చెందిన పిందలపల్లి అప్పల్‌నాయుడు, పోలోజి శంకర్‌రావును పిలిపించారు. వీరంతా కలసి ప్రొద్దుటూరులోని బంగారు షాపులను రెక్కీ చేశారు. ఈ నెల 21వ తేదీ ప్రొద్దుటూరులోని మోక్షగుండం వీధిలో ఉన్న బంగారు షాపులో చోరీ చేసేందుకు తెల్లవారుజామున 3 గంటలకు వెళ్లి వాచమనను బెదిరించి షాప్‌ తాళాలు పగులగొట్టి లోపలికి పోయే ప్రయత్నం చేస్తున్న సమయంలో అతను తప్పించుకొని గట్టిగా కేకలు వేయడంతో పది మంది అక్కడి నుంచి పరారయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులందరినీ గురువారం అరెస్టు చేసి ఆటో, ఐరన గ్యాస్‌ కట్టర్‌, కత్తి, మంకీక్యా్‌పలు, ఫేస్‌మా్‌స్కలు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్‌కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన బ్లూకోల్ట్స్‌ సిబ్బంది సుదర్శన రామ్‌మోహన, మధుసూదనరెడ్డిలకు నగదు రివార్డులను అందజేశారు.