మైనారిటీ బాలికపై అత్యాచారయత్నం

ABN , First Publish Date - 2020-08-05T11:51:45+05:30 IST

రాజమహేంద్రవరం రూరల్‌ మండల పరిధిలోని బొమ్మూరు గ్రామంలో కొత్తపేటకు చెందిన బాలికపై ముగ్గురు యువకులు ..

మైనారిటీ బాలికపై అత్యాచారయత్నం

రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 4:  రాజమహేంద్రవరం రూరల్‌ మండల పరిధిలోని బొమ్మూరు గ్రామంలో కొత్తపేటకు చెందిన బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారయత్నానికి ప్రయత్నించినట్టు బొమ్మూరు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం గ్రామంలో ఆ బాలిక నడిచి వెళుతుం డగా బలవంతంగా చెయ్యి పట్టుకుని లాక్కెళ్లి అత్యాచారయత్నం చేయబోతే ఆ బాలిక తప్పించుకుని పారిపోయి తల్లిదండ్రుల వద్దకు చేరింది. జరిగిన విష యాన్ని తల్లిదండ్రులకు తెలియజేస్తే వారు బొమ్మూరు పోలీసులను ఆశ్రయిం చారు.


గత కొద్దిరోజులుగా బాలిక వెంటపడుతూ వేధించిన ఆ యువకులు అత్యాచారయత్నం చేసేందుకు ప్రయత్నించి బాలిక తప్పించుకోవడంతో పరార య్యారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన బొమ్మూరు పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన ప్రధాన నిందితుడు సుధీర్‌బాబును అరెస్ట్‌ చేశారు. మరొక ఇద్దరు యువకుల కోసం గాలిస్తున్నట్టు సీఐ లక్ష్మణ్‌రెడ్డి తెలిపారు. కాగా నిందితులు వైసీపీకి చెందినవారని, వారిని తప్పించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ ఘటన వెనుక ఉన్న ఎంతటివారైనా అరెస్ట్‌ చేయాలని ముస్లిం యూత్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, పీపుల్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయు.


ఇది అత్యాచారాల పాలన  : టీడీపీ నేతల ధ్వజం 

రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 4: రాష్ట్రంలో ప్రజాసంక్షేమం కంటే అత్యా చారాల పాలన ఎక్కువగా కొనసాగుతోందని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా మాజీ చైర్మన్‌ గన్ని కృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి యర్రా వేణు, టీడీపీ యువ నేత ఆదిరెడ్డి వాసులు వేర్వేరు ప్రకటనలో ధ్వజమెత్తారు. ఇటీవల మధురపూడిలో దళిత బాలికపై అత్యాచారం జరిగిందని, ఇప్పుడు బొమ్మూరు గ్రామంలో మరో మైనారిటీ బాలి కపై అత్యాచారయత్నం జరిగిందని, దీంతో వైసీపీ పాలనలో మహిళలకు, బాలికలకు రక్షణ లేదనేది తేటతెల్లమైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా గాడితప్పిందని విమర్శించారు. ఈ ఘటనలపై సరైన చర్యలు తీసుకోకపోతే ఎంతవరకైనా తీసుకెళతామని హెచ్చరించారు.  

Updated Date - 2020-08-05T11:51:45+05:30 IST