డ్రెస్‌... మీ పనితీరుకు అడ్రస్‌!

ABN , First Publish Date - 2020-09-21T05:30:00+05:30 IST

‘‘ఉద్యోగులు, ఖాతాదారులతో సత్సంబంధాలు పెంచుకోవడానికి వీడియో కాన్ఫరెన్స్‌లు ఉపయోగపడతాయి. ఆ సమయంలో మీరు మంచి దుస్తులు ధరించకపోతే ఎదుటి వ్యక్తికి తప్పుడు అభిప్రాయం కలుగుతుంది’’ అంటారు ‘ద గోల్డెన్‌ ఆపిల్‌’ పుస్తక రచయిత ‘మాసన్‌ డోనోవాన్‌’...

డ్రెస్‌... మీ పనితీరుకు అడ్రస్‌!

‘‘ఉద్యోగులు, ఖాతాదారులతో సత్సంబంధాలు పెంచుకోవడానికి వీడియో కాన్ఫరెన్స్‌లు ఉపయోగపడతాయి. ఆ సమయంలో మీరు మంచి దుస్తులు ధరించకపోతే ఎదుటి వ్యక్తికి తప్పుడు అభిప్రాయం కలుగుతుంది’’ అంటారు ‘ద గోల్డెన్‌ ఆపిల్‌’ పుస్తక రచయిత ‘మాసన్‌ డోనోవాన్‌’. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్‌డౌన్‌లో ఇంటి నుంచే పనిచేసేటప్పుడు ఉద్యోగులు ఎలాంటిడ్రెస్‌ వేసుకోవాలనేది చాలా ముఖ్యం. సౌకర్యవంతంగా, స్టైలి్‌షగా... క్యాజువల్‌కూ, టూ క్యాజువల్‌కు మధ్యన సమతూకం పాటిస్తూ దుస్తులను ఎంపిక చేసుకోవాలని చెబుతున్నారు సెలబ్రెటీ స్టైలిస్ట్‌ అనీషా గాంధీ. 


  1. ఫార్మల్‌ డ్రెస్‌లో ఉన్నప్పుడు ఉద్యోగుల పనితీరు బాగున్నట్టు పరిశోధనల్లో వెల్లడైంది. దీనికి కారణం ఫార్మల్‌డ్రె్‌సలో ఉన్నప్పుడు వారు తమను తాము మరింత శక్తిమంతులు, సామర్థ్యం కలిగినవారిగా భావించడమే అంటారు పరిశోధకులు.
  2. చక్కగా డ్రెస్‌ చేసుకోవడం అంటే ఒక మంచి రోజుకు ప్రయాణం ఆహ్లాదంగా మొదలుపెట్టడం లాంటిదనే విషయం గుర్తుంచుకోవాలి. 
  3. క్యాజువల్‌, టూ క్యాజువల్‌ మధ్యన సమతూకం పాటించేలా డ్రెస్‌ల ఎంపిక ఉండాలి. 
  4. క్రీడా దుస్తుల బ్రాండెడ్‌ కంపెనీల ఉత్పత్తులను ప్రయత్నించవచ్చు. ఇవి తయారుచేసే ప్యాంట్లు చూడడానికి ట్రౌజర్‌లా కనిపిస్తాయి. బొందులతో లాగి కట్టుకొనే వదులైన స్వెట్స్‌ ప్యాంట్లలా అనుభూతిని ఇస్తాయి. కాబట్టి వీటిలోంచి ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. 
  5. ఇంటి నుంచి పనిచేసేటప్పుడు మెత్తటి షర్ట్‌లు, లెగ్గింగ్స్‌ ఉన్న స్వెట్‌షర్ట్‌లు ధరించడం వల్ల హాయిగా పనిచేసుకోవచ్చు. 
  6. ఇంటి నుంచి పనిచేసేవారికి వదులుగా, మెత్తగా ఉండే షర్ట్‌లు, లెగ్గింగ్స్‌ సౌకర్యంగా ఉంటాయి. 
  7. తెల్లటి టీ షర్ట్‌, చొక్కాపైకి కార్గోప్యాంట్స్‌ మంచి మ్యాచింగ్‌.
  8. మహిళా ఉద్యోగులకు ప్రియాంకా చోప్రా ధరించే షర్ట్‌డ్రె్‌సల లాంటివి పర్‌ఫెక్ట్‌గా సూటవుతాయి.
  9. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టైమ్‌లో స్కైప్‌కాల్స్‌, వీడియో కాల్స్‌ అటెండ్‌ అయ్యేటప్పుడు ఎలాంటి డ్రెస్‌లు వేసుకోవాలనే విషయంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు చక్కగా తల దువ్వుకొని, వైట్‌ టీషర్ట్‌పైన సిల్క్‌షర్ట్‌ వేసుకోవాలి. ఈ సందర్భంలో ప్యాంట్లు ఽఎలాంటివి ధరించినా ఇబ్బంది లేదు. అయితే సౌకర్యంతో పాటు కొంచెం స్టైలి్‌షగా కూడా ఉండేలా చూసుకోవాలి. దానికి ఫార్మల్‌ బ్లేజర్‌, బైక్‌ షార్ట్స్‌ ట్రై చేయవచ్చు. బైక్‌ షార్ట్స్‌ సౌకర్యంగా ఉండడంతో పాటు స్టైలి్‌షగానూ ఉంటాయి.  

Updated Date - 2020-09-21T05:30:00+05:30 IST