Abn logo
Sep 22 2021 @ 15:38PM

హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు: ఎమ్మెల్సీ అశోక్ బాబు

అమరావతి: ధర్మాన్ని రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తుందన్న విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. చట్టంలో లేకపోయినా 50 మంది సలహాదారులను పెట్టారన్నారు. టీటీడీ విషయంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ కు 151 మంది ఎమ్మెల్యేలున్నారనే అహముందని తెలిపారు.టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకంపై ఏపీ హైకోర్టు సీరియస్ అయిందన్నారు. ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జారీ చేసిన జీవోలను హైకోర్టు సస్పెండ్ చేసిందన్నారు. బోర్డు మెంబర్లు కూడా ప్రత్యేక పత్రాలు ఇవ్వడంతో సామాన్యులకు దర్శనం గగనమైందని చెప్పారు. లడ్డూలు, టికెట్ల ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption