బాత్‌రూంలో సెల్‌ఫోన్‌ను గమనించిన మహిళ.. అమెరికాలో..

ABN , First Publish Date - 2020-10-15T07:26:53+05:30 IST

అన్యాయానికి గురయ్యాం రక్షించమంటూ సామాన్య ప్రజలు కోర్టులను

బాత్‌రూంలో సెల్‌ఫోన్‌ను గమనించిన మహిళ.. అమెరికాలో..

హౌస్టన్, టెక్సాస్: అన్యాయానికి గురయ్యాం రక్షించమంటూ సామాన్య ప్రజలు కోర్టులను సంప్రదిస్తారు. తమకు న్యాయం జరిగేలా చూడమంటూ న్యాయవాదులను వేడుకుంటారు. కానీ.. అమెరికాలో ఓ న్యాయవాదే చేయకూడని పని చేసి తన వృత్తికి చెడ్డపేరు తీసుకొచ్చాడు. టెక్సాస్‌లోని హౌస్టన్‌లో న్యాయవాదిగా పనిచేస్తున్న ల్యాండన్ కీటింగ్(30) అనే వ్యక్తి తోటి మహిళా న్యాయవాది నగ్న వీడియోలను అనేక రోజుల నుంచి చిత్రీకరిస్తూ వచ్చాడు. బాత్‌రూంలో రహస్యంగా సెల్‌ఫోన్‌ను పెట్టి నగ్న వీడియోలను రికార్డు చేసి వాటిని చూస్తూ రాక్షసానందాన్ని పొందుతూ వచ్చాడు. 


అయితే గత మంగళవారం బాధిత మహిళా న్యాయవాది బాత్‌రూంలో సెల్‌ఫోన్‌ను గమనించింది. ఆ ఫోన్ ల్యాండన్‌కు చెందినదే అని తెలియడంతో వెంటనే అతడిపై హైటెక్ క్రైమ్స్ యూనిట్‌కు ఫిర్యాదు చేసింది. సెల్‌ఫోన్‌లో ఎన్నో రోజుల నుంచి తనకు చెందిన నగ్న వీడియోలు రికార్డ్ అవుతూ వచ్చాయని బాధిత న్యాయవాది అధికారులకు తెలిపింది. కాగా.. సెల్‌ఫోన్‌లో కొన్ని వందల ఫొటోలు, వీడియోలు ఉన్నట్టుగా దర్యాప్తులో అధికారులు తెలుసుకున్నారు. వెంటనే ల్యాండన్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ల్యాండన్‌కు 25 వేల డాలర్ల బాండ్‌పై కోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది. 

Updated Date - 2020-10-15T07:26:53+05:30 IST