మలక్‌పేటలో ఆడి కారు బీభత్సం...

ABN , First Publish Date - 2021-03-01T12:56:21+05:30 IST

ఈ సంఘటన మలక్‌పేట లాలాజర్‌ చౌరస్తాలో ..

మలక్‌పేటలో ఆడి కారు బీభత్సం...

హైదరాబాద్/చాదర్‌ఘాట్‌ : మితిమీరిన వేగంతో కారును నడుపుతూ బ్రేక్‌ను కంట్రోల్‌ చేయకపోవడంతో అదుపుతప్పి పల్టీలు కొడుతూ డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ సంఘటన మలక్‌పేట లాలాజర్‌ చౌరస్తాలో ఆదివారం ఉదయం జరిగింది. ఎస్‌ఐ హరీ‌ష్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆజంపుర ప్రాంత నివాసి అమీన్‌ సల్మాన్‌ (25) ఆడి కారును  ఆదివారం ఉదయం అతివేగంతో నడిపాడు. మలక్‌పేటలోని లాలాజర్‌ చౌరస్తా వద్దకు  రాగానే ఒక్కమారుగా బ్రేక్‌ వేయడంతో అదుపు తప్పి కారు పల్టీలు కొట్టింది. అనంతరం డివైడర్‌ ఢీ కొని నిలిచిపోయింది. కారు నడుపుతున్న సల్మాన్‌కు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డాడు. మెట్రో డివైడర్‌ను ఢీ కొట్టడంతో హెచ్‌ఎంఆర్‌ అధికారులు చాదర్‌ఘాట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-03-01T12:56:21+05:30 IST