Abn logo
Jun 15 2021 @ 11:17AM

పార్కింగ్‌లో ఉన్న ఆడీకారు మాయం

హైదరాబాద్ సిటీ/బౌద్ధనగర్‌ : పార్క్‌ చేసిన ఆడీకారు మాయమైంది. చిలకలగూడ డీఐ సంజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పద్మారావునగర్‌ లెజెండ్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న రోమిత్‌పటేల్‌ తన స్వస్థలమైన గుజరాత్‌లో రెండు రోజుల క్రితం సెకండ్స్‌లో ఆడీకారు(జీజే 06 జేక్యూ 4192)ను రూ. 8 లక్షలకు కొనుగోలు చేశాడు. వాహనాన్ని నగరానికి తీసుకొచ్చి సోమవారం తను నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో పార్క్‌ చేశాడు. మధ్యాహ్నం 1.30 గంటలకు చూడగా కారు కనిపించకపోవడంతో చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.