Advertisement
Advertisement
Abn logo
Advertisement

నేను తలచుకుంటే.. నీ యూనిఫామ్‌ తీయించేస్తా!

  • ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్‌లో బెదిరింపులు
  • సోషల్‌ మీడియాలో ఆడియో వైరల్‌ 

హైదరాబాద్ సిటీ/చార్మినార్‌ : ఫోన్‌లో పోలీసు అధికారికి బెదిరింపులకు సంబంధించిన ఓ ఆడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. ఆసిఫ్‌ అనే వ్యక్తి మొఘల్‌పురా ఇన్‌స్పెక్టర్‌కు రవికుమార్‌కు ఫోన్‌ చేసి ‘ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. నేను తలచుకుంటే నీ యూనిఫామ్‌ తీయించేస్తా’ అంటూ మాట్లాడిన ఆడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై రవికుమార్‌ను సంప్రదించగా ఆసిఫ్‌ గతంలో ఎంబీటీలో పనిచేసి ప్రస్తుతం ఇంక్విలాబ్‌ ఏ మిల్లత్‌ పార్టీలో ఉన్నాడని తెలిపారు. ఒమన్‌లో ఉన్న ఆసిఫ్‌ ఆ ఆడియోను సోషల్‌ మీడియాలో పెట్టాడని తెలిపారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు.

Advertisement
Advertisement