Abn logo
Sep 28 2021 @ 00:54AM

అనారోగ్యంతో ఆడిటర్‌ మృతి

మృతుడి కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న మాజీ మంత్రి పల్లె

నల్లమాడ, సెప్టెంబరు 27: మండల కేంద్రంలో నివసిస్తున్న ఆడిట ర్‌ మధుసూదన్‌రెడ్డి (56) అనారోగ్యం కారణంగా సోమవారం మృతి చెందాడు. ఈయన కదిరి సబ్‌డివిజన్‌లోని సహకార బ్యాంక్‌లకు ఆడిటర్‌ గా పనిచేస్తూ ఉండేవాడు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడని, పలు ఆసుపత్రులలో చికిత్సలు పొందడంతో ఆరోగ్యం మెరు గు అయ్యిందని బంధువులు తెలిపారు అయితే పది రోజుల క్రితం ద్విచక్ర వాహనంలో వెళ్తూ ప్రమాదవశాత్తూ కిందపడటంతో ప్రైవేటు ఆసుపత్రుల లో చికిత్సలు చేయించినా ఆరోగ్యం మెరుగుకాకపోవడంతో బెంగుళూరుకు వెళ్ళగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య సాయమ్మ, కుమార్తె ఉన్నారు. 

పలువురి పరామర్శ

ఆడిటర్‌ మధుసూదన్‌రెడ్డి మృతి చెందిన సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రె డ్డి, కదిరి ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డిలు సోమవారం నల్లమాడకు వెళ్లి మృతు డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతదేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే నాగరాజారెడ్డి, డాక్టర్‌ నాగేంద్ర కుమార్‌రెడ్డి పరామర్శించిన వారిలో ఉన్నారు.