బంగ్లాపై ఆసీస్ విజయం

ABN , First Publish Date - 2020-02-28T10:10:59+05:30 IST

వరల్డ్‌క్‌పలో ఆస్ట్రేలియా జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. గ్రూప్‌-ఎలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 86 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది.

బంగ్లాపై ఆసీస్ విజయం

కాన్‌బెరా: వరల్డ్‌క్‌పలో ఆస్ట్రేలియా జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. గ్రూప్‌-ఎలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 86 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలుత ఆసీస్‌.. ఓపెనర్లు అలీసా హీలీ (83), బెత్‌ మూనీ (81 నాటౌట్‌) అర్ధసెంచరీలతో అదరగొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 189 పరుగులు సాధించింది. గార్డెనర్‌ 22 పరుగులతో అజేయంగా నిలిచింది. ఛేదనలో బంగ్లా.. మెగాన్‌ షట్‌ (3/21), జెస్‌ జొనాసెన్‌ (2/17) బౌలింగ్‌ ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 103 పరుగులకే పరిమితమైంది. బంగ్లా బ్యాట్స్‌వుమెన్‌లో అత్యధికంగా ఫర్గానా హోక్‌ 36 రన్స్‌ చేసింది. అలీసా హీలీకి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. 

Updated Date - 2020-02-28T10:10:59+05:30 IST