ఆస్ట్రేలియా-వెస్టిండీస్ టీ20 సిరీస్ వాయిదా

ABN , First Publish Date - 2020-08-04T22:37:15+05:30 IST

ఆస్ట్రేలియా ఆతిథ్యంలో జరగవలసిన టీ20 ప్రపంచ కప్ వాయిదా పడిన విషయం తెలిసిందీ. అయితే టీ20 ప్రపంచ కప్‌కు ముందుగా ప్రాక్టీస్..

ఆస్ట్రేలియా-వెస్టిండీస్ టీ20 సిరీస్ వాయిదా

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా ఆతిథ్యంలో జరగవలసిన టీ20 ప్రపంచ కప్ వాయిదా పడిన విషయం తెలిసిందీ. అయితే టీ20 ప్రపంచ కప్‌కు ముందుగా ప్రాక్టీస్ కోసం ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లు అక్టోబర్‌లో ఓ టీ20 సిరీస్‌ను నిర్వహించాలనుకున్నాయి. అయితే కరోనా కారణంగా టీ20 ప్రపంచ కప్ వాయిదా పడిందని, దీంతో ఈ టీ20 సిరీస్‌ను కూడా రద్దు చేశామని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్(సీఏ) తెలిపింది. దీనికి ఇరుదేశాలు అంగీకరించాయని వెల్లడించింది. ఆటగాళ్లందరూ ఐపీఎల్-2020లో పాల్టొనబోతున్నారని పేర్కొంది. ఇదిలా ఉంటే ఆటగాళ్లందరూ ఐపీఎల్‌లో పాల్గొనబోతుండటంతో పలు దేశాలు తమ తదుపరి సిరీస్‌లను రద్దు చేసుకున్నాయి. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌ల మధ్య సెప్టెంబరులో జరగాల్సిన వన్డే సిరీస్‌ నిర్వహణ కూడా అనుమానంగా మారింది. దీంతో పాటు జింబాబ్వేతో జరగాల్సిన వన్డే సిరీస్ కూడా రద్దయింది. సౌత్‌ఆఫ్రికా కూడా సెప్టెంబరులో వెస్టిండీస్‌తో ఆడాల్సిన సిరీస్‌ను కూడా నిలిపివేసింది.

Updated Date - 2020-08-04T22:37:15+05:30 IST