అగర్ సిక్సర్
ABN , First Publish Date - 2021-03-04T09:41:58+05:30 IST
ఆస్టన్ అగర్ (6/30) అదరగొట్టడంతో.. న్యూజిలాండ్‌తో మూడో టీ20లో పర్యాటక ఆస్ట్రేలియా 64 పరుగులతో విజయం సాధించింది...
- కివీస్‌పై ఆసీస్ గెలుపు
వెల్లింగ్టన్: ఆస్టన్ అగర్ (6/30) అదరగొట్టడంతో.. న్యూజిలాండ్‌తో మూడో టీ20లో పర్యాటక ఆస్ట్రేలియా 64 పరుగులతో విజయం సాధించింది. మ్యాక్స్‌వెల్ (70), ఫించ్ (69) మోతమోగించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 208/4 స్కోరు చేసింది. ఛేదనలో అగర్ దెబ్బకు న్యూజిలాండ్ 17.1 ఓవర్లలో 144 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ గప్టిల్ (43) టాప్ స్కోరర్. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీ్‌సను ఆసీస్ 1-2తో సజీవంగా ఉంచుకొంది.