Australia డిప్యూటీ ప్రధానమంత్రికి కొవిడ్ పాజిటివ్

ABN , First Publish Date - 2021-12-09T13:06:03+05:30 IST

అమెరికా దేశ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ఉప ప్రధాని బర్నాబీ జాయిస్ కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది...

Australia డిప్యూటీ ప్రధానమంత్రికి కొవిడ్ పాజిటివ్

వాషింగ్టన్: అమెరికా దేశ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ఉప ప్రధాని బర్నాబీ జాయిస్ కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి బర్నాబీ జాయిస్ వాషింగ్టన్ డీసీలో అధికారిక పర్యటనలో ఉండగా కరోనా పరీక్ష చేయగా కొవిడ్-19 పాజిటివ్ అని తేలినట్లు అతని కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.అమెరికాలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా ప్రతినిధి బృందంలోని మిగిలిన సభ్యులకు పరీక్షించగా కరోనా నెగెటివ్ అని వెల్లడైందని యూఎస్ అధికారులు చెప్పారు. వైద్యుల తదుపరి సలహా ఇచ్చే వరకు బర్నాబీ జాయిస్ ఐసోలేషన్ లో ఉంటారని అమెరికా తెలిపింది.బర్నాబీ జాయిస్ కు కరోనా తేలికపాటి లక్షణాలున్నాయని వైద్యులు చెప్పారు.


 కరోనా మహమ్మారి ప్రారంభం అయ్యాక మొట్టమొదటిసారి ఆస్ట్రేలియా అత్యున్నత స్థాయి నాయకుడైన ఉప ప్రధాని కరోనా బారిన పడ్డారు.బ్రిటన్ పర్యటన ముగించుకుని మంగళవారం అమెరికా చేరుకున్న జాయిస్ అక్కడ సీనియర్ ప్రభుత్వ అధికారులను కూడా కలిశారు.


Updated Date - 2021-12-09T13:06:03+05:30 IST