Australia: విద్యార్థులకు ఆస్ట్రేలియా ఆహ్వానం

ABN , First Publish Date - 2022-09-19T13:47:00+05:30 IST

ఆస్ర్టేలియా ప్రభుత్వ ఏజెన్సీ ఆస్ర్టేలియన్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ‘స్టడీ ఆస్ర్టేలియా’ పేరుతో నగరంలో ఓ హోటల్‌లో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆస్ర్టేలియాకు చెందిన 26 యూనివర్శిటీల ప్రతినిధులు తమ వద్ద అందించే కోర్సు

Australia: విద్యార్థులకు ఆస్ట్రేలియా ఆహ్వానం

ఎన్నారై డెస్క్: ఆస్ర్టేలియా ప్రభుత్వ ఏజెన్సీ ఆస్ర్టేలియన్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ‘స్టడీ ఆస్ర్టేలియా’ పేరుతో నగరంలో ఓ హోటల్‌లో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆస్ర్టేలియాకు చెందిన 26 యూనివర్శిటీల ప్రతినిధులు తమ వద్ద అందించే కోర్సులు, స్కాలర్‌షి్‌పలు, ఉద్యోగావకాశాలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వివరించారు. ఆస్ర్టేలియన్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ కమిషన్‌ (ఆస్‌ట్రేడ్‌) డైరెక్టర్‌, ఇండియా డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ వీకే.సింగ్‌ మాట్లాడుతూ.. ప్రపంచ శ్రేణి విద్య, శక్తిమంతమైన కెరీర్‌ మార్గాలు, సాటిలేని జీవనశైలిని ఆస్ర్టేలియా విద్యార్థులకు అందిస్తుందన్నారు. 




భారతీయ విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యం పెంచేందుకు వీలుగా స్టడీ ఆస్ర్టేలియా ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్‌ ప్రోగ్రామ్‌ (ఎస్‌ఏఐఈపీ) ప్రారంభించినట్లు తెలిపారు. స్టడీ ఆస్ర్టేలియాకు సంబంధించిన మరింత సమాచారాన్ని https://www.studyaustrali.gov.au/india వెబ్‌సైట్‌లో పొందవచ్చన్నారు. రోడ్‌షోకు హాజరైన విద్యార్థుల స్టూడెంట్‌ వీసా, గ్రాడ్యుయేట్‌ మార్గంపై ఆస్ర్టేలియా వీసా, ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వెల్లడించారు. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య అభ్యసించాలనే విద్యార్థుల కోసం ఈ నెల 20న యూని ఎక్స్‌పర్ట్స్‌ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా అడ్మిషన్‌ డే నిర్వహిస్తున్నట్లు సంస్థ తెలంగాణ ఆపరేషన్స్‌ హెడ్‌ ఉమా తెలిపారు. సోమాజిగూడలో సంస్థ కార్యాలయంలో మార్కెటింగ్‌ మేనేజర్‌ పవన్‌తో కలిసి ఆమె మాట్లాడారు.


Updated Date - 2022-09-19T13:47:00+05:30 IST