భారత్-ఆస్ట్రేలియా మధ్య విమాన సేవల పునరుద్ధరణ!

ABN , First Publish Date - 2021-05-14T17:58:33+05:30 IST

కరోనా విజృంభణ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే విమానాలను ఆస్ట్రేలియా ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధించిన సంగతి తెలిసిందే

భారత్-ఆస్ట్రేలియా మధ్య విమాన సేవల పునరుద్ధరణ!

కరోనా విజృంభణ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే విమానాలను ఆస్ట్రేలియా ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధం ఈ రోజు (శుక్రవారం) అర్ధరాత్రితో ముగియనుంది. ఈ రోజు నుంచి నిషేధాన్ని ఎత్తేస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు. 


అర్ధరాత్రి నుంచి ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చెందిన అన్ని వాణిజ్య విమాన సర్వీసులు యథావిధిగా నడుస్తాయని ప్రకటించారు. అయితే ప్రతి సర్వీసు ప్రారంభానికి ముందు పటిష్ట తనిఖీ ఉంటుందని తెలిపారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య విమాన ప్రయాణాల నిషేధం ఈ నెల 3వ తేదీన అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. భారత్ నుంచి స్వదేశానికి వచ్చే ఆస్ట్రేలియన్లను కూడా అనుమతించలేదు. 

Updated Date - 2021-05-14T17:58:33+05:30 IST