‘బాగా లావుగా ఉన్నావంటూ నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు..’ సోషల్ మీడియాలో వైరల్ కథనం..!

ABN , First Publish Date - 2022-01-24T02:18:24+05:30 IST

ఉద్యోగంలో చేరిన మొదటి రోజే జాబ్ కోల్పోయిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. లావుగా ఉన్నందుకే తనను ఉద్యోగం నుంచి తీసేశారని అతడు పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన హేమిష్ గ్రిఫిన్ ఇటీవల ఎదుర్కొన్న పరిస్థితి ఇది.

‘బాగా లావుగా ఉన్నావంటూ నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు..’  సోషల్ మీడియాలో వైరల్ కథనం..!

కాన్‌బెర్రా: ఉద్యోగంలో చేరిన మొదటి రోజే జాబ్ కోల్పోయిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. లావుగా ఉన్నందుకే తనను ఉద్యోగం నుంచి తీసేశారని అతడు పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన హేమిష్ గ్రిఫిన్ ఇటీవల ఎదుర్కొన్న పరిస్థితి ఇది. క్విన్స్‌ల్యాండ్‌లో నివసించే అతడు.. కొత్త ఉద్యోగం కోసం మూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో రాష్ట్రం టాస్మేనియాకు తన మకాం మార్చాడు. తన వెంట భార్యాపిల్లలను కూడా తీసుకొచ్చాడు. బిగ్4స్ట్రాహన్ హాలిడే రిట్రీట్ అనే హోటల్‌లో పనిలోకి దిగాడు. 


ఈ క్రమంలోనే సంస్థ యజమాని సోఫాను తీసుకురమ్మని అతడికి పురమాయించాడు. అయితే..దాన్ని తీసుకొచ్చే క్రమంతో అతడు ఆయాసపడుతుండటం గమనించిన యజమాని నీవు ఈ ఉద్యోగానికి తగినవాడివి కావంటూ తీసేశాడు. బాగా లావుగా ఉన్న తనకు విధుల్లో ఉండగా ఏదైనా ప్రమాదం జరిగితే.. సంస్థ బాధ్యత తీసుకోవాల్సి వస్తుందనే తనను తొలగించినట్టు హేమిష్ పేర్కొన్నాడు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అంటూ హేమిష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన ఫొటో చూశాకే ఉద్యోగంలోకి తీసుకున్నారని హేమిష్.. సంస్థ యజమాని ఇప్పుడిలా చేయడం సబబు కాదంటూ కామెంట్ చేశారు. సంస్థ నిర్ణయం కారణంగా తన బతుకు వీధిలోకి వచ్చేసిందని బోరుమన్నాడు. 

Updated Date - 2022-01-24T02:18:24+05:30 IST