16 కోట్ల విలువైన వస్తువులను భారత్‌కు పంపనున్న ఆస్ట్రేలియా

ABN , First Publish Date - 2021-07-30T07:21:07+05:30 IST

కంగారూ దేశం ఆస్ట్రేలియా నుంచి కొన్ని చరిత్రాత్మక కళాఖండాలు భారత్‌కు చేరుకోబోతున్నాయి. వీటిలో కొన్నింటిని

16 కోట్ల విలువైన వస్తువులను భారత్‌కు పంపనున్న ఆస్ట్రేలియా

కాన్‌బెర్రా: కంగారూ దేశం ఆస్ట్రేలియా నుంచి కొన్ని చరిత్రాత్మక కళాఖండాలు భారత్‌కు చేరుకోబోతున్నాయి. వీటిలో కొన్నింటిని గతంలో భారత్‌ నుంచి కొందరు దొంగిలించారు. ఈ మేరకు నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా కొన్ని ఫొటోలను విడుదల చేసింది. మొత్తం 14 కళాఖండాలను భారత్‌కు తిరిగి పంపుతున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది. వీటన్నింటి విలువ 16 కోట్ల రూపాయలపైగానే ఉంటుందని అంచనా. ఆస్ట్రేలియా తిరిగిస్తున్న ఈ కళాఖండాల్లో శిల్పాలు, పెయింటింగులు, ఫొటోలు ఉన్నాయి. వీటిలో కొన్ని దొంగిలించినవి కాగా, మరికొన్ని ఎక్కడి నుంచి వచ్చాయో సరైన ఆధారాలు తెలియవు. ఈ పధ్నాలుగింటిలో 13 కళాఖండాలతో స్మగ్లర్‌గా పేరున్న సుభాష్ కపూర్‌కు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-07-30T07:21:07+05:30 IST