Advertisement
Advertisement
Abn logo
Advertisement

కీరన్ పొలార్డ్ కెప్టెన్ ఇన్సింగ్.. ఆస్ట్రేలియా ఎదుట ఓ మోస్తరు విజయ లక్ష్యం

అబుదాబి: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. 70 పరుగులకే క్రిస్ గేల్ (15), నికోలస్ పూరన్ (4), రోస్టన్ చేజ్ (0), ఎవిన్ లూయిస్ (29) వంటి కీలక ఆటగాళ్లు పెవిలియన్ చేరారు. దీంతో జట్టు భారాన్ని తన భుజాలపై వేసుకున్న కెప్టెన్ కీరన్ పొలార్డ్  సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డుపై పరుగులు పేర్చుకుంటూ పోయాడు.


ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆడాడు. అతడికి షిమ్రన్ హెట్‌మయర్ నుంచి చక్కని సహకారం లభించింది. ఈ క్రమంలో 27 పరుగులు చేసి హెట్‌మయర్ ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కూడా అతడాదడపా షాట్లు కొడుతూ పరుగులు పెంచే ప్రయత్నం చేసిన పొలార్డ్ 31 బంతుల్లో 4 ఫోర్లు సిక్సర్‌తో 44 పరుగులు చేసి అవుటయ్యాడు. చివరల్లో ఆండ్రూ రసెల్ 7 బంతుల్లో ఫోర్, రెండు సిక్సర్లతో 18 పరుగులు చేయడంతో జట్టు స్కోరు 157 పరుగులకు చేరుకుంది. ఆసీస్ బౌలర్లలో జోష్ హేజిల్‌వుట్ 4 వికెట్లు తీసుకున్నాడు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement