Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇప్పటికి.. ఇంటికి చేరారు

సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎట్టకేలకు తమ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఐపీఎల్‌ వాయిదా పడడంతో వీరంతా మాల్దీవుల్లో పది రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండి సిడ్నీలో అడుగుపెట్టారు. అయితే అక్కడికి వెళ్లాక కూడా ఆసీస్‌ ప్రభుత్వం వీరిని మరో 14 రోజులపాటు హోటల్‌ క్వారంటైన్‌లోనే ఉంచింది. ఆ గడువు కూడా ఆదివారం ముగియడంతో వీరంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో సుదీర్ఘ విరామం తర్వాత స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, కమిన్స్‌, బెహ్రెన్‌డార్ఫ్‌, హెన్రిక్స్‌ తదితర క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బంది, కామెంటేటర్లు మొత్తం 38 మంది తమ సొంతిళ్లకు చేరారు. వీరంతా తమ సంతోషాన్ని సోషల్‌ మీడియాలో వ్యక్తపరిచారు. ఇక వచ్చే నెల 9 నుంచి ఆసీస్‌ క్రికెట్‌ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం విండీ్‌సలో పర్యటించనుంది.

సీఏ సీఈవోగా హాక్లే: క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో)గా నిక్‌ హాక్లే అధికారికంగా నియమితుడయ్యాడు. 2020 జూన్‌లో కెవిన్‌ రాబర్ట్స్‌   రాజీనామా చేసినప్పటి నుంచి.. హాక్లే తాత్కాలిక సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ పదవి కోసం ఎంతో మందిని ఇంటర్వ్యూలు చేసినా.. బోర్డు సభ్యులు మాత్రం హాక్లేకే ఓటేసినట్టు సీఏ తెలిపింది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జన్మించిన హాక్లే.. స్కూల్‌ రోజుల్లో రగ్బీ ఆడేవాడు. కార్పొరేట్‌ ఫైనాన్స్‌ ప్రొఫెషనల్‌గా మారిన తర్వాత ఆస్ట్రేలియాకు మకాం మార్చాడు. 2012లో లండన్‌ ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ కమిటీలకు సేవలందించాడు. 

Advertisement
Advertisement