షాకింగ్: అతడు తిమింగలాన్ని రక్షించాడు.. అధికారులు జరిమానా విధించారు !

ABN , First Publish Date - 2020-05-20T01:31:45+05:30 IST

తిమింగలం ప్రాణాలు రక్షించినందుకు సంతోషించాలో జరిమానా కట్టాల్సి వచ్చినందుకు బాధపడాలో తెలినీ స్థితిలో చిక్కుపోయాడో ఆస్ట్రేలియా యువకుడు.

షాకింగ్: అతడు తిమింగలాన్ని రక్షించాడు.. అధికారులు జరిమానా విధించారు !

కాన్‌బెర్రా: తిమింగలం ప్రాణాలు రక్షించినందుకు సంతోషించాలో జరిమానా కట్టాల్సి వచ్చినందుకు బాధపడాలో తెలినీ స్థితిలో చిక్కుపోయాడో ఆస్ట్రేలియా వ్యక్తి. క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన అతడు మంగళవారం నాడు.. ఈతకని స్థానికంగా ఉన్న గోల్డ్‌కోస్ట్ బీచ్‌కు వెళ్లాడు. అక్కడ.. షార్క్ నెట్‌లో(సోరచాపల నుంచి ప్రజలను రక్షించేందుకు ఉద్దేశించింది) ఓ తిమింగలం ఇరుక్కుపోవడాన్ని చూసి అతడు బాధ పడ్డాడు. దాన్ని ఎలాగైన రక్షించాలనకొని ముందుగా స్థానిక అధికారులకు సమాచారం అందించాడు. గంటలు గడుస్తున్నా వారి నుంచి స్పందన లేకపోవడంతో తనే రంగంలోకి దిగాడు. తిమింగలాన్ని చుట్టుకుని ఉన్న నెట్(కంచెను) తొలగించి దాన్ని రక్షించాడు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల నెట్‌ తెగిపోయింది. అయితే.. ఒడ్డుకు చేరుకున్న తరువాత అతడికి అధికారులు షాకిచ్చారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూర్చాడనే కారణంతో అతడిపై జరిమానా విధించారు. దీంతో..ఓ మూగ జీవాన్ని కాపాడినందుకు ఆనంద పడాలో జేబుకు చిల్లుపడ్డందుకు ఏడవాలో తెలికే తలపట్టుకున్నాడు సదరు యువకుడు. కాగా.. సొరచాపల నుంచి ప్రజలను రక్షించేందుకు వినియోగించే షార్క్ నెట్లపై అక్కడ ఎంతో కాలంగా వివాదం చెలరేగుతోంది. ఇది పర్యావరణానికి హాని కలిగిస్తోందంటూ అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2020-05-20T01:31:45+05:30 IST