యూఎస్ ఓపెన్ నుంచి మరో టెన్నిస్ స్టార్ ఔట్

ABN , First Publish Date - 2020-08-03T01:12:25+05:30 IST

యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ నుంచి ఒక్కొక్కరుగా ఆటగాళ్లు వైదొలగుతున్నారు. కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతున్న...

యూఎస్ ఓపెన్ నుంచి మరో టెన్నిస్ స్టార్ ఔట్

వాషింగ్టన్: యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ నుంచి ఒక్కొక్కరుగా ఆటగాళ్లు వైదొలగుతున్నారు. కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతున్న కారణంగానే తాము ఈ టోర్నీలో పాల్గొనడం లేదని బహిరంగంగా చెబుతున్నారు. రెండు రోజుల క్రితం ప్రపంచ నెంబర్ వన్ ప్లేయర్ యాష్‌లీ బార్టీ యూఎస్ ఓపెన్‌లో తాను పాల్గొనడం లేదని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మరో స్టార్ టెన్నిస్ ప్లేయర్ కూడా టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఇటీవల  జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆస్ట్రేలియన్ ఆటగాడు కిర్గియోస్ తాను ఈ టోర్నీలో పాల్గొనడం లేదంటూ సంచలన ప్రకటన చేశాడు. ‘నేను టోర్నీ నుంచి వైదొలుగుతున్నాను. ప్రజల కోసం.. నా దేశం కోసం.. ఇప్పటికే కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వందల మంది అమెరికన్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను. టెన్నిస్‌ను ఎప్పుడైనా పునఃప్రారంభించవచ్చు. కానీ కరోనా మహమ్మారి వల్ల నష్టపోయిన ఒక్క ప్రాణాన్ని కూడా వెనక్కి తీసుకురాలేమ’ని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 13 వరకు యూఎస్ ఓపెన్ టోర్నీని నిర్వహించనున్నట్లు టెన్సిస్ సమాఖ్య ప్రకటించింది. అయితే ఈ టోర్నీలో పాల్గొనేందుకు మరికొంత మంది ఆటగాళ్లు కూడా విముఖత చూపుతున్నట్లు సమాచారం. టోర్నీ ప్రారంభం అయ్యేనాటికి ఇంకెంతమంది గౌర్హాజరవుతారో వేచిచూడాలి.

Updated Date - 2020-08-03T01:12:25+05:30 IST