ఒక్క కరోనా టీకా డోసు తీసుకుంటే ఓ లాటరీ టిక్కెట్.. ప్రజలకు బంపర్ ఆఫర్.. ! ప్రభుత్వానికి 8431 కోట్లు ఖర్చు!

ABN , First Publish Date - 2022-01-21T02:41:25+05:30 IST

: టీకా తీసుకునే దిశగా ప్రజలను ప్రోత్సహించేందుకు ఆస్ట్రియా ప్రభుత్వం ఓ సరికొత్త పథకంతో ముందుకు వచ్చింది. జాతీయ స్థాయిలో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్టు ప్రకటించింది.

ఒక్క కరోనా టీకా డోసు తీసుకుంటే ఓ లాటరీ టిక్కెట్.. ప్రజలకు బంపర్ ఆఫర్.. ! ప్రభుత్వానికి 8431 కోట్లు ఖర్చు!

ఇంటర్నెట్ డెస్క్: టీకా తీసుకునే దిశగా ప్రజలను ప్రోత్సహించేందుకు ఆస్ట్రియా ప్రభుత్వం ఓ సరికొత్త పథకంతో ముందుకు వచ్చింది. జాతీయ స్థాయిలో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్టు ప్రకటించింది. రెండు టీకాలు తీసుకున్న వారికి రెండు లాటరీ టిక్కెట్లు, బూస్టర్ కూడా తీసుకున్న వారికి మూడు టిక్కెట్లు ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ పథకం ప్రకారం.. ప్రతి పదో లాటరీ టెక్కెట్టుకు 500 యూరోల విలువగల ఓ గిఫ్ట్ వోచర్ గెలవచ్చు. ఈలెక్కన యావత్తు దేశంలో లాటరీ అమలు చేసేందుకు ఏకంగా ఒక బిలియన్ యూరోలు ఖర్చవుతుందని ప్రభుత్వం చెబుతుతోంది. మన  కరెన్సీలో చెప్పుకోవాలంటే ఇది ఏకంగా.. 8431 కోట్లు! ఇక.. కరోనా నుంచి రక్షించుకోవాలంటే టీకా వెయించుకోవడంతో పాటూ తప్పనిసరిగా మాస్కు ధరించాలన్న విషయం తెలిసిందే.       

Updated Date - 2022-01-21T02:41:25+05:30 IST