ఆస్ట్రియా కీలక నిర్ణయం.. నిషేధిత జాబితా నుంచి ఇండియా ఔట్

ABN , First Publish Date - 2021-08-20T06:35:58+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మమమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇండియా విషయంలో ఆస్ట్రియా కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రయాణికులకు తీపి కబురు చెప్పింది. పూర్తి వివరాల్లోకి వె

ఆస్ట్రియా కీలక నిర్ణయం.. నిషేధిత జాబితా నుంచి ఇండియా ఔట్

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మమమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇండియా విషయంలో ఆస్ట్రియా కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రయాణికులకు తీపి కబురు చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సెకండ్ వేవ్ రూపంలో కరోనా మహమ్మారి భారత్‌పై విరుచుకుపడింది. దీంతో ప్రపంచంలోని చాలా దేశాలు భారత్ నుంచి రాకపోకలను నిలిపివేశాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు కాస్త మెరుగుపడటంతో ఆయా దేశాలు భారత్‌కు తిరిగి విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆస్ట్రియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాను నిషేధిత జాబితా నుంచి తప్పించింది.



అంతేకాకుండా వేకేషన్ కోసం ఆస్ట్రియాకు వచ్చే భారతీయులు ఇకపై తప్పనిసరిగా క్వారెంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్టు ధ్రువీకరణ పత్రం పొందిన ప్రయాణికులు ప్రీ ట్రావెల్ క్లియరెన్స్ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఆస్ట్రీయా అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా సదరు ప్రయాణికులకు సెల్ఫ్ ఐసోలేషన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపారు. ఏదేని సురక్షిత దేశంలో 10 రోజులపాటు గడిపి, ఆస్ట్రియాకు చేరుకున్న ప్రయాణికులకు కూడా ఇవి వర్తిస్తాయని స్పష్టం చేశారు. అయితే సదరు ప్రయాణికులు వ్యాక్సినేషన్ పూర్తైనట్టు లేదా కొవిడ్ ఇన్‌ఫెక్షన్ నుంచి కోలుకున్నట్టు ప్రూఫ్ చూపించాల్సి ఉంటుందని చెప్పారు. నెగేటివ్ సర్టిఫికెట్‌ను చూపించే ప్రయాణికులు మాత్రం ప్రీ ట్రావెల్ క్లియరెన్స్ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. అంతేకాకుండా వారు 10 రోజులపాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుందని చెప్పారు. 


Updated Date - 2021-08-20T06:35:58+05:30 IST