అధికారులు అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-11-28T05:00:31+05:30 IST

తుఫాను వల్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపఽథ్యంలో అధి కారులు అప్రమత్తంగా వుండాలని తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌ పేర్కొన్నారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి
మండల స్థాయి అధికారుల సమీక్షలో మాట్లాడుతున్న తహసీల్దారు నజీర్‌అహ్మద్‌

ప్రొద్దుటూరు అర్బన్‌ నవంబరు 27: తుఫాను వల్ల వర్షాలు కురుస్తాయని  వాతావరణ శాఖ హెచ్చరికల నేపఽథ్యంలో అధి కారులు అప్రమత్తంగా వుండాలని తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. శనివారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో తుఫాను హెచ్చరికల పై మండలస్థాయి అధికారులతో తహ సీల్దారు నజీర్‌ అహ్మద్‌ సమావేశమై మాట్లాడుతూ  చెన్నమ రాజుపల్లె నాగాయపల్లె చెరువుల వద్ద  పర్యవేక్షణకు వీఆర్‌వో, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌లకు డ్యూటీలు వేయాలన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లోకి ఎవరు వెళ్ళకుండా పోలీసులతో గస్తీ నిర్వహించాలన్నారు. మైలవరం రిజర్వాయర్‌లోకి వచ్చే నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకు నేందుకు తహసీల్దారు కార్యాలయంలో కాల్‌ సెంటర్‌ పెట్టామన్నారు. ఎర్రగుంట్ల రోడ్డులోని హైలెవెల్‌ బ్రిడ్జి వద్ద భారీ వాహనాలు ప్రయాణించ కుండా నియంత్రణ పెట్టామన్నారు.  ప్రజలు అప్రమత్తంగా వుండాన్నారు. సమావేశంలో ఎంపీడీవో రహీమ్‌, ఆర్‌ఐ సుద ర్శన్‌ ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ, రూరల్‌ ఎస్‌ఐ  పాల్గొన్నారు.

Updated Date - 2021-11-28T05:00:31+05:30 IST