ఎవరిని అడిగినా మావి కాదంటూ సమాధానం.. మరి ఈ రూ.99 లక్షలు ఎవరివి..?

ABN , First Publish Date - 2022-01-22T02:04:12+05:30 IST

జనవరి 19న నోయిడాలో అధికారుల తనిఖీల్లో రూ.99లక్షలు పట్టుబడటం సంచలనం కలిగించింది. జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు, ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ...

ఎవరిని అడిగినా మావి కాదంటూ సమాధానం.. మరి ఈ రూ.99 లక్షలు ఎవరివి..?

ఉత్తరప్రదేశ్‌లో కొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. మరోవైపు నల్లధనాన్ని వెలికి తీసేందుకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు.. సోషల్ మీడియా ద్వారా ప్రజల సహకారం కోరుతున్నారు. సమాచారం అందించేవారి పేర్లను గోప్యంగా ఉంచుతామని చెబుతున్నారు. నల్లధనం అక్రమ రవాణాను అరికట్టేందుకు యూపీ అంతటా అధికారులు సుమారు 300మందికి పైగా పరిశీలకులను మోహరించినట్లు తెలుస్తోంది.


ఇదిలావుండగా.. జనవరి 19న నోయిడాలో అధికారుల తనిఖీల్లో రూ.99లక్షలు పట్టుబడటం సంచలనం కలిగించింది. జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు, ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఓ కారును ఆపి తనిఖీ చేశారు. అందులో ఉన్న రూ.99లక్షలకు సంబంధించి.. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. కారులోని వ్యక్తులను ప్రశ్నించగా.. ఢిల్లీకి చెందిన వస్త్ర వ్యాపారికి నగదు అందజేసేందుకు వెళ్తున్నట్లు తెలిపారు. అయితే అధికారులు వ్యాపారిని సంప్రదించగా తనకు ఎలాంటి సంబంధం లేదనడంతో నగదును సీజ్ చేశారు.

డబ్బుల కోసం ఔత్సాహిత దర్శకుడి హైటెక్ ప్లాన్.. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బట్టబయలైన అసలు నిజం..


కారు ఓ మహిళ పేరుతో రిజిస్టర్ అయిందని తేలింది. అయితే సదరు మహిళ కూడా తనకు, కారుకు సంబంధం లేదని చెప్పింది. దీంతో నగదు, కారును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు అధికారులు స్పెషల్-26 పేరుతో 26మంది అధికారులను నియమించినట్లు తెలిపారు. అక్రమంగా మద్యం, నగదు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

సెల్ఫీలను అమ్ముతూ రూ.కోట్లు సంపాదిస్తున్న యువకుడు.. ఎలాగో తెలుసుకుంటే అవాక్కవుతారు..

Updated Date - 2022-01-22T02:04:12+05:30 IST