అధికారులు మండలాభివృద్ధికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-01-23T06:30:26+05:30 IST

ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి మెలిసి సమన్వయంలలో పనిచేసి మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి, ఎమెల్సీ తూమాటి మాదవరావులు తెలిపారు.

అధికారులు మండలాభివృద్ధికి కృషి చేయాలి
సమీక్షిస్తున్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి

అధికారులు మండలాభివృద్ధికి కృషి చేయాలి

ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి

వలేటివారిపాలెం, జనవరి 22 : ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి మెలిసి సమన్వయంలలో పనిచేసి మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి, ఎమెల్సీ తూమాటి మాదవరావులు తెలిపారు. వలేటివారిపాలెం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ పొనుగోటి మౌనిక అధ్యక్షతన శనివారం మద్యాహ్నం 3 గంటలకు మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఆ సమావేశానికి కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తూమాటి మాదవరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అయా శాఖలకు సంబంధించిన మండలస్థాయి అధికారులు ఆయా శాఖలలో అమలువు తున్న సంక్షేమ పథకాలు ప్రగతి నివేదికలను సమావేశంలో ప్రజా ప్రతినిదులకు చదివి వినిపించారు.  డ్వాక్రా మహిళలతో అభయహస్తం డబ్బులు కట్టించుకోవడం లేదని, అర్హులైన మహిళలకు అభయహస్తం పింఛన్లు ఇవ్వడంలేదని, అభయహస్తం కడుతూ మధ్యలో కట్టకుండా నిలిపోయిన మహిళలకు తిరిగి కట్టిన డబ్బులు ఇవ్వడంలేదని ఎంపీటీసీ రవీంద్ర సంభందిత అధికారులను ప్రశ్నించారు. ఓటీఎస్‌ చెల్లించాలని అదికారులు డ్వాక్రా మహిళలపై ఒత్తిళ్లు తెస్తున్నారని కొండసముద్రం సర్పంచ్‌ మన్నం వెంగమ్మ తెలిపారు. మాలకొండలో ఎక్‌ప్రెక్స్‌ ఆర్టీసి బస్సులు నిలపడం లేదని, దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారని అయ్యవారిపల్లె సర్పంచ్‌ డేగా.వెంకటేశ్వర్లు సమావేశంలో అదికారుల దృష్టికి తీసువచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మహీదర్‌రెడ్డి మాట్లాడుతూ ఆయా సమస్యలు పరిష్కారించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎమ్మెల్సీ తూమాటి మాదవరావు మాట్లాడుతూ రామాయపట్నం పోర్టు, మాలకొండ వద్ద నిమ్జ్‌, బైపాస్‌ ఏర్పాట్లు పూర్తయితే జిల్లా అన్ని రంగాలలో అభివృద్ది చెందుంతుందన్నారు.  కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు ఇంటూరి భారతి, ఎంపీడీవో రపీక్‌అహ్మద్‌, ఎంపీటీసీలు, మండలస్థాయి అధికారులు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T06:30:26+05:30 IST