Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఓటీఎస్‌పై అధికారుల బెదిరింపులు సరికాదు

గాతలవలస(పోలాకి): గతంలో నిర్మించిన ఇళ్లకు సంబంధించి వన్‌టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) చేసుకోవాలని, లేకుంటే పింఛన్లు రద్దు చేస్తామని అధికారులు బెదిరించడం సరికాదని టీడీపీకి చెందిన సర్పంచ్‌ మెండ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఓటీఎస్‌ విషయంలో పునరాలోచిం చాలని సూచించారు. ఉపాధి హామీలో చేపట్టనున్న పనులకు సంబంధించి తీర్మానాలు చేయడం బాగున్నా వేతనదారులకు సకాలంలో బిల్లులు చెల్లించేలా ప్రతిపాదనలు పంపాలని కోరారు.  గాతలవలస పరిధిలోని గ్రామాల అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కృషి చేస్తానన్నారు. సమావేశంలో ఎంపీటీసీ సభ్యుడు యాగాటి లక్ష్మణరావు, ఉపాఽధి సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండ గా దీర్ఘాసి సచివాలయ గ్రామసభకు పరిశీలకులుగా వచ్చిన ఏపీఎం జి.రాజా రావు ఓటీఎస్‌పై వలంటీర్లు బాధ్యత వహించాలని కోరారు. ఓటీఎస్‌ చెల్లిం చాలని లబ్ధిదారులను  కోరుతున్నా ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల్లో చెల్లించలేమని చెబుతున్నారని వలంటీర్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మెండ కృష్ణసుమంగళి, కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

  

‘రాష్ట్ర ప్రజలపై భస్మాసుర హస్తం’

కొత్తూరు: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పేరుతో పేద ప్రజలపై భస్మాసుర హస్తం పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి ఆరోపించారు. మాతలలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలకు రూ.10 వేలు వంతున చెల్లించి ఓటీఎస్‌ చేసుకోవాలని బెదిరించడం దారుణమన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటి రిజిస్ట్రేషన్లు ఉచితంగా చేపడతామన్నారు.  డ్వాక్రా మహిళల బీమా మొత్తం కూడా మళ్లించడం దారుణమన్నారు.

  

Advertisement
Advertisement