Abn logo
Sep 23 2021 @ 09:10AM

డివైడర్‌ను ఢీకొన్న ఆటో: ముగ్గురి మృతి

                  - మరో ముగ్గురికి గాయాలు


పెరంబూర్‌(చెన్నై): అతి వేగం ముగ్గురి ప్రాణాలు తీయగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యా యి. స్థానిక తాంబరం సమీపంలోని ఇరుంబులియూర్‌ సిగ్నల్‌ ప్రాంతంలో బుధవారం ఓ ఆటో అతివేగంగా వెళుతోంది. ఆ సమయంలో ముందు వెళుతున్న బస్సును ఓవర్‌టేక్‌ చేసే సమయంలో అదుపుతప్పిన ఆటో రోడ్డు పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొనింది. ఈ ఘటనలో కడలూరు జిల్లాకు చెందిన ఐసక్‌రాజ్‌ (52), ఉత్తిరమేరూర్‌కు చెందిన సుందరరాజన్‌ (37), పుదువైకి చెందిన నాగముత్తు (36) సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, ఏలుమలై, రజనీకాంత్‌, ఆనందకుమార్‌లకు తీవ్రగాయాల య్యాయి. సమాచారం అందుకున్న క్రోంపేట పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదుచేసి పరారైన ఆటో డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు.


క్రైమ్ మరిన్ని...