షార్ట్‌ సర్క్యూట్‌తో ఆటో దగ్ధం

ABN , First Publish Date - 2022-01-21T04:41:46+05:30 IST

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఆటో దగ్ధమైనట్లు రిమ్స్‌ సీఐ సదాశివయ్య తెలిపారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో ఆటో దగ్ధం
కాలిపోయిన ఆటో

కడప(క్రైం), జనవరి 20 : విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఆటో దగ్ధమైనట్లు రిమ్స్‌ సీఐ సదాశివయ్య తెలిపారు.  కడప శ్రీరామ్‌నగర్‌కు చెందిన ఓబుల సుబ్బయ్య ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి 10.30 గంటలకు ఆటోను ఇంటి ముందు పార్కింగ్‌ చేసి ఇంటిలోకి వెళ్లాడని అనంతరం ఆటో నుంచి మంటలు చెలరేగి కాలిపోయినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రూ.30 వేల మేర ఆస్తి నష్టం జరిగిందని, ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

Updated Date - 2022-01-21T04:41:46+05:30 IST