ఆటో కదలదు.. జీవనం సాగదు

ABN , First Publish Date - 2021-05-17T04:46:20+05:30 IST

ఆస్పత్రికి వెళ్లాలన్నా, ఆ ర్టీసీ బస్టాండుకు వెళ్లాలన్నా పేద, మధ్యతరగతి ప్రజలు ఆటోలో వెళ్లక తప్పదు.

ఆటో కదలదు.. జీవనం సాగదు
బాడుగ లేక ఇంటి పట్టునే ఉన్న ఆటో...

పోరుమామిళ్ల, మే 16 : ఆస్పత్రికి వెళ్లాలన్నా, ఆ ర్టీసీ బస్టాండుకు వెళ్లాలన్నా పేద, మధ్యతరగతి ప్రజలు ఆటోలో వెళ్లక తప్పదు. దీంతోనే ఆటో కార్మికుల జీవనం సజావుగా సాగేది. కానీ ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో కర్ఫ్యూ నిబంధనలు విధించడంతో పూర్తి స్థాయిలో ఆటోలు నడపలేక ఫైనాన్స్‌ చెల్లించలేక కుటుంబాన్ని పోషించుకోలేక ఆటో కార్మికులు అప్పులపాలయ్యారు. పోరుమామిళ్లలో దాదాపు 120 చిన్న ఆటోలున్నాయి. అదనంగా ట్రా వెల్స్‌కు సంబంధించి మరో 80 ఆటోలను నమ్ముకుని చాలా మంది జీవనం సాగిస్తున్నారు. అలాంటిది మధ్యాహ్నం వరకే తిరగాలన్న నిబంధన విధించడంతో ఆటో కార్మికులు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. అంతేకాక బస్టాండుకు బద్వేలు డిపో నుంచి 2, మైదుకూరు డిపో నుంచి 2, గిద్దలూరు డిపో నుంచి 2, మరో డిపో నుంచి 2 కలిపి మొత్తం 8 వాహనాలు మాత్రమే రావడంతో ప్ర యాణికకుల రద్దీ కూడా తగ్గింది. గ్రామీణ ప్రాం తాల్లోని వారు కూడా ఈ కరోనా పరిస్థితుల్లో బ యటికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఆటోలనే నమ్ముకుని జీవనం సాగించేవారు ఒక్కసారిగా ఆలోచనలో పడి ఆందోళన చెందుతున్నా రు. మరికొందరు కుటుంబ పోషణ కోసం గృహ నిర్మాణ పనులకు వెళుతున్నారు. సకాలంలో ఫైనాన్స్‌ చెల్లించకపోవడంతో కొందరు ఫైనాన్స్‌ వారు ఆటోలను కూడా ఎత్తుకెళుతున్నారని సమాచారం. ఇప్పటికే పది ఆటోలను ఫైనాన్స్‌ వారు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఉదయం నుంచి 12 వరకు తిరిగినా రూ.200 కూడా రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. డీజలుకు రూ.50 చెల్లించినా చివరికి చేతికి వందో, 50 మిగలడంతో ఈ డబ్బుతో జీవనం ఎలా సాగించాలని ఆవేదన చెందుతున్నా రు. ఫైనాన్సియర్ల నుంచి తమకు ఒత్తిడి లేకుంటే కాస్తయినా ఊరట వస్తుందంటున్నారు. గత కరో నా సమయంలో వడ్డీ తీసుకోమని చెప్పినా తరువాత వడ్డీతో సహా ముక్కుపిండి వసూలు చేశారని, చివరి కంతు చెల్లించే వరకు క్లియరెన్స్‌ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.


Updated Date - 2021-05-17T04:46:20+05:30 IST