ఆటోబోల్తా: డ్రైవర్‌ మృతి

ABN , First Publish Date - 2022-01-25T04:10:19+05:30 IST

పెద్దమండ్యం -గాలివీడు మార్గంలో సోమవారం ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో డ్రైవర్‌ మృతిచెందారు.

ఆటోబోల్తా: డ్రైవర్‌ మృతి
మృతిచెందిన రామాంజులు

పెద్దమండ్యం, జనవరి 24: పెద్దమండ్యం -గాలివీడు మార్గంలో సోమవారం ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో డ్రైవర్‌ మృతిచెందారు. మండలంలోని కొలిమికాడపల్లెకు చెందిన తలారి రామాంజూలు(32) గాలివీడుకు వెళ్తుండగా, మార్గమధ్యలోని పెద్దమండ్యం నమాజుకట్టపై ఆటో బోల్తా పడింది. ఆటో ఓనర్‌, డ్రైవర్‌గా ఉంటున్న రామాంజులు తీవ్రంగా గాయపడ్డాడు.  చికిత్స నిమిత్తం 108లో రాయచోటి ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్సకోసం కడప రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి మృతిచెందారు.

Updated Date - 2022-01-25T04:10:19+05:30 IST