Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

 విజయనగరం: ప్రేమ వ్యవహారంలో పోలీసులు తనను  స్టేషన్‌కి పిలిచారని ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. మెంటాడ మండలంలోని ఆండ్ర పోలీస్ స్టేషన్‌లో ఈ సంఘటన జరిగింది. పోలీస్ స్టేషన్‌లోనే ఆటో డ్రైవర్ సవరవిల్లి శేఖర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కొన్ని రోజల క్రితం  ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి అభం శుభం తెలియని బాలికను ఆటో‌డ్రైవర్ శేఖర్ తన వెంట తీసుకువెళ్లాడు. అంతేకాకుండా ఆ బాలిక అసభ్యకర చిత్రాలను తన ఫోన్‌లో శేఖర్ బంధించాడు. దీంతో పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.


శేఖర్ దగ్గర ఉన్న బాలికను కనిపెట్టి తిరిగి తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. అనంతరం బాలిక మిస్సింగ్ కేసుగా పోలీసులు నమోదు చేశారు. ఫోన్‌లో అసభ్యకర చిత్రాలు తొలగించాలని శేఖర్‌ను పోలీసులు స్టేషన్‌కి పిలిపించారు. దీంతో పీఎస్‌లో పురుగుల మందు తాగి ఆటో డ్రైవర్‌ శేఖర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే చికత్స నిమిత్తం శేఖర్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. 

Advertisement
Advertisement