Advertisement
Advertisement
Abn logo
Advertisement

December 15న హైదరాబాద్‌లో ఆటోల బంద్‌..

  • డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌  
  • తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ జేఏసీ కన్వీనర్‌ అమానుల్లాఖాన్‌


హైదరాబాద్ సిటీ/నల్లకుంట : సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్‌ 15న ఆటోల బంద్‌ కార్యక్రమం నిర్వహిస్తామని తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ జేఏసీ కన్వీనర్‌ మహ్మద్‌ అమానుల్లాఖాన్‌ హెచ్చరించారు. ఆదివారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పొరుగు జిల్లాల ఆటోలు గ్రేటర్‌ హైదరాబాద్‌లో అనుమతించకుండా తగు చర్యలు తీసుకోవాలని పోలీసు, ఆర్టీఏ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. తద్వారా నగరంలోని నిరుపేద ఆటోడ్రైవర్లను ఆదుకోవాలని కోరారు.


ముఖ్యంగా డీజిల్‌తో నడుస్తూ కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఓలా, ఊబర్‌ క్యాబ్‌లను నగరంలో తిరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణం గా ఆటో మీటర్‌ చార్జీలను వెంటనే పెంచాలని, ప్రైవేట్‌ ఆటో ఫైనాన్షియర్ల దోపిడీని శాశ్వతంగా అరికట్టడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించాలన్నారు. ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో  తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ జేఏసీ నాయకులు కె.లక్ష్మీనర్సయ్య, మిర్జా రఫతుల్లా బేగ్‌, వంశీ కృష్ణ, పాల్గొన్నారు.

Advertisement
Advertisement