Abn logo
Sep 23 2021 @ 00:39AM

ఆటో బోల్తా..మహిళ మృతి

గాండ్లపెంట, సెప్టెంబరు 22: మండలంలోని ఎర్ర జేనుపల్లి సమీపంలో బుధవారం ఆటోబోల్తాపడిన సంఘ టనలో భూక్యా లక్ష్మీదేవి (67) మృతిచెందారు. ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపిన వివరాల మేరకు బనాన్‌చెరువుకు చెందిన లక్ష్మీదేవీ మండల కేంద్రంలో బ్యాంక్‌లో పనులు ముగించుకుని, స్వగ్రామానికి వెళ్ళడానికి ఆటోలో వెళ్తుం డగా మార్గమధ్యలోని ఎర్రజేనుపల్లి వద్ద ఆటోకు కుక్క అడ్డు రావ డంతో ఆటోఅదుపు తప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో భూక్యా లక్ష్మీదేవి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు మహిళలు గంగులమ్మ, నరసమ్మ, లక్ష్మీదేవి గాయపడ్డారు. గాయప డిన ముగ్గురిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం తరలించారు. లక్ష్మీదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసు కున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలికి భర్త భూక్యా నారా యణ నాయక్‌, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.