మార్చిలో ‘ఆటో’ సేల్స్‌ 28% డౌన్‌

ABN , First Publish Date - 2021-04-09T05:49:26+05:30 IST

ఆటోమొబైల్స్‌ డీలర్ల సంఘాల సమాఖ్య (ఫాడా).. గత నెల వాహన రిటైల్‌ విక్రయాల గణాంకాలను విడుదల చేసింది. దేశం లో అన్ని విభాగాల వాహనాల మొత్తం సేల్స్‌ ఏకంగా 28.64 శాతం క్షీణించాయని తెలిపింది

మార్చిలో ‘ఆటో’ సేల్స్‌ 28% డౌన్‌

కార్లు, ట్రాక్టర్ల అమ్మకాలు జూమ్‌   

టూవీలర్ల విక్రయాల్లో భారీ క్షీణత: ఫాడా 


న్యూఢిల్లీ: ఆటోమొబైల్స్‌ డీలర్ల సంఘాల సమాఖ్య (ఫాడా).. గత నెల వాహన రిటైల్‌ విక్రయాల గణాంకాలను విడుదల చేసింది. దేశం లో అన్ని విభాగాల వాహనాల మొత్తం సేల్స్‌ ఏకంగా 28.64 శాతం క్షీణించాయని తెలిపింది. కార్లు సహా ఇతర ప్యాసింజర్‌ వాహనాలు, ట్రాక్టర్ల అమ్మకాలు గణనీయ వృద్ధిని నమోదు చేసుకోగా.. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాల విక్రయాలు మాత్రం భారీ క్షీణతను చవిచూశాయి. దేశంలోని 1,277 ప్రాంతీయ రవాణా కార్యాలయాల నుంచి సేకరించిన వాహన రిజిస్ట్రేషన్ల వివరాల ఆధారంగా ఫాడా ఈ డేటాను విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే మాత్రం అన్ని వాహన విభాగాల రిటైల్‌ విక్రయాల్లోనూ వృద్ధి నమోదైంది. 


భవిష్యత్‌పై అనిశ్చితి మబ్బులు 

ఉగాది, పెళ్లిళ్ల సీజన్‌లో వాహన కొనుగోళ్లపై కరోనా రెండో విడత ఉధృతి తీవ్ర ప్రభావం చూపవచ్చని ఫాడా ఆందోళన వ్యక్తం చేసింది. గడిచిన కొన్ని నెలల్లో వాహన రంగంలో  వరుస గా నమోదైన విక్రయాల వృద్ధి మళ్లీ గాడి తప్పే ప్రమాదం ఉందని పేర్కొంది. దేశవ్యాప్త వాహన విక్రయాల్లో మహారాష్ట్ర వాటానే 10-11 శాతంగా ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో మినీ లాక్‌డౌన్‌ అమలవుతుండటంతో విక్రయాలు భారీగా తగ్గొ చ్చని భావిస్తోంది. ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు  పెరుగతుండటం, సెమీకండక్టర్ల కొరత మున్ముం దు అమ్మకాలపై ప్రభావంచూపొచ్చని అంటోంది.

Updated Date - 2021-04-09T05:49:26+05:30 IST