Abn logo
Sep 26 2021 @ 01:37AM

మీరూ వాహన ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయొచ్చు

స్థలం, వనరులు ఉంటే సరిపోతుంది

వ్యక్తులు, సంఘాలు, సంస్థలు, ప్రభుత్వాలకు ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌కు అనుమతి


న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించాలంటే ఆర్టీయే కార్యాలయాలకు వెళ్లాల్సిందే! అక్కడ మోటారు వాహన ఇన్‌స్పెక్టర్‌(ఎంవీఐ) వాహనం బ్రేకులు, హెడ్‌లైట్లు, ఇంజన్‌ సామర్థ్యం, కాలు ష్య విడుదల తీరు, టైర్ల సామర్థ్యం.. ఇలా పలు అంశాలను పరిశీలించి వాహనానికి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇస్తా రు. ఇకపై ఆటోమెటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌(ఏటీఎ్‌స)లను అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రవాణాశాఖ అధికారులే వీటిని నిర్వహిస్తారని భావించారు. అయితే.. ప్రవేటు వ్యక్తులు, సంస్థలు, కంపెనీలు/స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్స్‌(ఎ్‌సపీవీ)లు, సంఘాలు, ప్రభుత్వాలకు ఏటీఎ్‌సల అనుమతి ఇస్తామని కేంద్ర రవాణా, హైవేల శాఖ శనివారం తెలిపింది. ఈ మేరకు విధివిధానాలు విడుదల చేసింది.


ఎలాంటి వారికి లైసెన్స్‌ ఇస్తారు?

పైన పేర్కొన్న కేటగిరీలకు ఏటీఎ్‌సలను నిర్వహించేందుకు లైసెన్సులు ఇస్తారు.

ఏటీఎ్‌సల ఏర్పాటుకు తగినంత స్థలం అవసరం. వాహనాల పార్కింగ్‌, వాహనాలు తిరిగేందుకు అవసరమయ్యే అంతర్గత రోడ్లు, సైబర్‌ సెక్యూరిటీ సంస్థ అందించే సర్టిఫికేషన్‌ ఉన్న కంప్యూటర్‌ వ్యవస్థ, ఐటీ సర్వర్‌, ఏటీఎస్‌ యంత్రాలను సమకూర్చుకోవాలి. ఈ సర్వర్లతో కేంద్ర ప్రభుత్వ వాహన్‌ డేటా అనుసంధాన మై ఉంటుంది. కాబట్టి హ్యాకింగ్‌ దుర్భేద్యమైన వ్యవస్థ ఉందని నమ్మకం కలిగించాలి.

ఏటీఎస్‌ ఏర్పాటు తర్వాత టెస్టింగ్‌, క్యాలిబ్రేషన్‌, ల్యాబ రేటరీలపై జాతీయ అక్రెడిటేషన్‌ బోర్డు(ఎన్‌ఏబీఎల్‌) గుర్తింపు పొందాలి. ప్రతి ఆర్నెల్లకోసారి ఎన్‌ఏబీఎల్‌ సర్టిఫికేషన్‌ తప్పనిసరి. ఈ ఆడిట్‌కు అయ్యే ఖర్చును ఏటీఎస్‌ నిర్వహణ సంస్థలు/వ్యక్తులే భరించాలి.


టెస్టింగ్‌ ఇలా..

ఏటీఎస్‌లలో పూర్తిస్థాయిలో ఆటోమేషన్‌ యంత్రాలతో పరీక్షలు నిర్వహిస్తారు.

వాహనం విండ్‌ స్ర్కీన్‌ మొదలు.. సైలెన్సర్‌ పటిష్ఠత.. ఇంజన్‌ సామర్థ్యం మొదలు.. టైర్ల పనితీరు దాకా పరీక్షలన్నీ ఆటోమేటిక్‌గా నిర్వహించి, సర్టిఫికేట్‌ ఇస్తారు.

ఈ పరీక్షలో వాహనం ఫెయిలైతే వాహనదారుడు రీ- టెస్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం మళ్లీ ఫీజు చెల్లించాలి. రీ-టె్‌స్టలోనూ ఫెయిలైతే రాష్ట్రాల రవాణా శాఖ కమిషనర్‌ నేతృత్వంలోని అప్పీలేట్‌ అథారిటీని ఆశ్రయించాల్సి ఉంటుంది. వాహనాల ఫిట్‌నెస్‌పై అప్పిలేట్‌ అథారిటీతే తుది నిర్ణయం.

అప్పీలేట్‌ అథారిటీ దగ్గర కూడా వాహనం ఫెయిలైతే.. ఇక దాన్ని స్ర్కాప్‌నకు పంపాల్సిందే

ప్రస్తుతం రవాణా వాహనాలకు.. వాహనం కొనుగోలు నుంచి 8 ఏళ్ల వరకు ప్రతి రెండేళ్ల కోసారి ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించడం తప్పనిసరి. 8 ఏళ్ల తర్వాత.. ప్రతి సంవత్సరం ఫిట్‌నెస్‌ పరీక్ష చేయించాలి. వ్యక్తిగత వాహనాలకు వాహనం కొనుగోలు చేసిన 15 ఏళ్లకు ఫిట్‌నెస్‌ పరీక్ష చేయించాలి. ఆ తర్వాత ప్రతి ఐదేళ్లకోసారి ఫిట్‌నెస్‌ పరీక్ష తప్పనిసరి.