ఐదు నిమిషాల్లో అంతా క్లీన్‌

ABN , First Publish Date - 2020-07-12T06:20:16+05:30 IST

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న రీవాక్స్‌ ఫార్మా.. ప్రత్యేకమైన బ్యాక్టీరియా, వైర్‌సలను తొలగించే అటానమస్‌ రోబో యూవీరోవా బీఆర్‌ను గాంధీ హాస్పిటల్‌కు అందజేసింది...

ఐదు నిమిషాల్లో అంతా క్లీన్‌

  • గాంధీ హాస్పిటల్‌లో యూవీరోవా బీఆర్‌ రోబో
  • అందజేసిన రీవాక్స్‌ ఫార్మా 

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న రీవాక్స్‌ ఫార్మా.. ప్రత్యేకమైన బ్యాక్టీరియా, వైర్‌సలను తొలగించే అటానమస్‌ రోబో యూవీరోవా బీఆర్‌ను గాంధీ హాస్పిటల్‌కు అందజేసింది. కరో నా వ్యాధిగ్రస్తులకు చికిత్సనందిస్తున్న ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసీయూ) వద్ద ఈ మొబైల్‌ ర్యాపిడ్‌ వైరస్‌ ఇన్ఫెక్షన్‌ రోబో.. యూవీరోవా బీఆర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కొత్త పేషంట్‌కు బెడ్‌ను కేటాయించే ముందు చుట్టూ ఉన్న ప్రాంతంతో పాటు ఖాళీ చేసిన బెడ్‌లను యూవీరోబో పూర్తిగా డిస్‌ఇన్ఫెక్ట్‌ చేస్తుందని పేర్కొంది. కేవలం ఐదు నిమిషాల్లోనే అత్యంత వేగంగా ఐసీ యూ బెడ్స్‌, ట్రీట్‌మెంట్‌ గదులు, పీపీఈ, మాస్కులతో పా టు ఉపరితలాన్ని వైరస్‌ రహితంగా చేస్తుందని తెలిపింది.


శనివారం నాడిక్కడ ఈ యూవీరోబో బీఆర్‌ను  తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావుకు రీవాక్స్‌ ఫార్మా చైర్మన్‌ మోహన్‌ తాయల్‌, డైరెక్టర్‌ జగన్నాధ్‌, సీఎంఓ జి ప్రణయ్‌ రెడ్డి అందజేశారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా రీవాక్స్‌ ఫార్మా.. ప్రభుత్వ హాస్పిటల్స్‌కు అధునాతన టెక్నాలజీలతో కూడిన పరికరాలను అందజేయ టం ఎంతో సంతోషాన్నిస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 


Updated Date - 2020-07-12T06:20:16+05:30 IST