Lakhimpur Kheri: బులెట్ల వల్ల కాదు..రక్తస్రావం వల్లే ఆ మరణాలు

ABN , First Publish Date - 2021-10-05T15:11:19+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీ ఘటనలో నాలుగు మృతదేహాల పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూశాయి...

Lakhimpur Kheri: బులెట్ల వల్ల కాదు..రక్తస్రావం వల్లే ఆ మరణాలు

పోస్టుమార్టం రిపోర్టులో వెలుగుచూసిన సంచలన విషయాలు

లఖింపూర్ ఖేరీ(ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీ ఘటనలో నాలుగు మృతదేహాల పోస్టుమార్టం  నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. మరణించిన రైతులు షాక్, అధిక రక్తస్రావం వల్లే మరణించారని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. రైతుల మృతదేహాలకు  బుల్లెట్ గాయాలు కనిపించలేదని నివేదిక తెలిపింది. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య బన్బీర్‌పూర్ పర్యటనను నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు.ఆదివారం ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో రైతుల నిరసన సందర్భంగా చెలరేగిన హింసలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.టికునియా-బన్బీర్‌పూర్ రహదారిపై ఆందోళన చేస్తున్న నక్షత్ర సింగ్ (55), దల్జీత్ సింగ్ (35), లవేప్రీత్ సింగ్ (20),గురువేంద్ర సింగ్ (18) అనే నలుగురు రైతులు మరణించారని రైతుసంఘాల నేతలు చెప్పారు.


Updated Date - 2021-10-05T15:11:19+05:30 IST