మున్సిపాలిటీకి రెండు చెత్త సేకరణ ఆటోలు

ABN , First Publish Date - 2021-05-18T06:53:21+05:30 IST

కందుకూరు మున్సిపాలిటీకి రెండు చెత్త సేకరణ ఆటో లను పెరల్స్‌ డిస్టలరీస్‌ యాజమాన్యం విరాళంగా అందజేసింది.

మున్సిపాలిటీకి రెండు చెత్త సేకరణ  ఆటోలు
ఆటోలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

 సామాజిక బాధ్యతగా ‘పెరల్స్‌’ దాతృత్వం

కందుకూరు, మే 17: కందుకూరు మున్సిపాలిటీకి రెండు చెత్త సేకరణ  ఆటో లను పెరల్స్‌ డిస్టలరీస్‌ యాజమాన్యం విరాళంగా అందజేసింది. కరోనా నేప థ్యంలో చెత్తసేకరణ, పారి శుధ్య నిర్వహణ  కార్యక్ర మాలకు వాహనాల కొరతను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డి విజ్ఞప్తితో పెరల్స్‌ డిస్టలరీస్‌ నిర్వాహకులు ఈ ఆటోలను అందజేశారు. మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం నూతన చెత్త సేకరణ  ఆటోలను ప్రారంభించిన ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత ఫండ్‌ కింద వివిధ సంస్థలు కందుకూరు నియోజక వర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమకూర్చారని చెప్పారు. నియోజకవర్గంలో ఏర్పాటై ఉన్న పరిశ్రమలతో పాటు మన నియోజకవర్గంకు సంబం ధం లేని పరిశ్రమల యజమానులు కూడా టీఆర్‌ఆర్‌ కళాశాల అభివృద్ధికి భారీ విరాళాలు అందజేశారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమి షనర్‌ ఎస్‌. మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-18T06:53:21+05:30 IST