Advertisement
Advertisement
Abn logo
Advertisement

అవకాడో ఐస్‌క్రీం

కావలసినవి : పాలు - అరలీటరు, పంచదార - తగినంత, అవకాడోలు - రెండు, క్రీమ్‌ - 200ఎంఎల్‌, నిమ్మరసం - ఒక టీస్పూన్‌, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - ఒక టీస్పూన్‌.


తయారీ విధానం: ముందుగా పాలు బాగా మరిగించాలి. ఎక్కువ సమయం మరిగిన తరువాత చిక్కబడిన పాలలో పంచదార వేసి కరిగించాలి. ఆ పాత్రను ఒక కవర్‌తో గాలి తగలకుండా మూసేసి గంట పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. అవకాడోల పొట్టు తీయాలి. గింజలు లేకుండా తీసేయాలి. తరువాత ఒక పాత్రలోకి వాటిని తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టిన పాలు, క్రీమ్‌, నిమ్మరసం, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ వేసి బ్లెండర్‌ సహాయంతో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐస్‌క్రీమ్‌ మేకర్‌లోకి మార్చి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. సాయంత్రం వేళ చల్ల చల్లగా అవకాడో ఐస్‌క్రీమ్‌ తింటుంటే భలేగా అనిపిస్తుంది. 

ఉసిరికాయ జ్యూస్‌కస్టర్డ్‌ యాపిల్‌ ఐస్‌క్రీమ్‌ మ్యాంగో తిరమిసు మ్యాంగో బేక్డ్‌ యోగర్ట్‌మ్యాంగో కుల్ఫీఎండుఫలం మిల్క్‌షేక్‌కివి మింట్‌ లెమనేడ్‌ఫలూదావాటర్‌మెలన్‌ ఐస్‌క్రీంమ్యాంగో ఐస్‌క్రీం
Advertisement