Abn logo
Nov 23 2020 @ 01:04AM

అవమానం భరించలేక ఆత్మహత్య

సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగు మందు తాగుతున్న చీర లింగస్వామిKaakateeya

సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగిన యువకుడు

తుర్కపల్లి, నవంబరు 22: అవమాన భారం భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకు న్నాడు.  బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్యాల కు చెందిన యువకుడు చీర లింగస్వామి(24) సర్పంచ్‌ దామోదర్‌గౌడ్‌కు ముఖ్య అనుచరుడు. అనారోగ్య సమస్యల నేపథ్యంలో సర్పంచ్‌ దామో దర్‌గౌడ్‌ వారం రోజులుగా కుటుంబసభ్యులతో హైదరాబాద్‌లో ఉంటున్నాడు. మర్యాలలో ఉన్న స ర్పంచ్‌ ఇంటి మరో తాళం లింగస్వామి వద్ద ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉన్న ఇంట్లో నగదు, నగలు పోయాయని ఈ నెల 21వ తేదీన లింగస్వామిని, తల్లిదండ్రులను, బంధువులను సర్పంచ్‌ మర్యాలలోని తన ఇంటికి పిలిపించాడు. ఇంట్లో పెట్టిన డబ్బులు తీశావంటూ, సీసీ ఫుటేజీ చూపించాలా అంటూ.. తల్లిదండ్రులు, బంధు వుల ఎదుట సర్పంచ్‌ మందలించటంతో మనస్తాపానికి గురైన లింగస్వామి అక్కడి నుంచి వెళ్లిపో యాడు. అవమాన భారంతో మధ్యాహ్న సమయంలో తన వ్యవసా య బావి వద్ద పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. వీడియోను కుటుం బసభ్యులకు, స్థానిక వాట్సప్‌ గ్రూపుల్లో షేర్‌ చేశాడు. తాను దొంగతనం చేయ లేదని, పురుగుల మందు తాగి చనిపోతున్నట్లు కుటుంబసభ్యులకు ఫోన్‌ చేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు, కుటుంబీకులు లింగస్వామిని చికిత్స ని మిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. సర్పంచ్‌ దామోదర్‌గౌడ్‌ బెదిరించడంతో తన కుమారుడు లింగస్వామి  ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి చీర ఐలమ్మ ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యాదగిరి తెలిపారు. ఈ ఘటన నేప థ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆదివారం ఉదయం నుంచే గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భువనగిరి రూరల్‌ సీఐ జానయ్య ఆధ్వర్యంలో ఎస్‌ఐ యాదగిరి బందోబస్తు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం పోలీసుల పహారాలో లింగస్వామి అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement
Advertisement